Economy Development : ఆర్థికాభివృద్ధిలో అగ్రగామిగా భారత్‌..

సాక్షి ఎడ్యుకేష‌న్‌: అధిక ఆర్థికాభివృద్ధి సాధిస్తున్న పెద్ద దేశాల్లో అగ్రగామిగా భారతదేశం కొనసాగుతుందని ప్రపంచ బ్యాంకు తాజా నివేదికలో పేర్కొంది. వచ్చే మూడేళ్లలో భారత్‌ 6.7 శాతం వృద్ధిరేటు సాధించే అవకాశం ఉందని వివరించింది. 2023–2024 మన దేశం 8.2 శాతం వృద్ధిరేటు నమోదు చేసింది. ఇది అంచనాల కంటే అధికం. తదుపరి మూడు ఆర్థిక సంవత్సరాల్లో వృద్ధి రేటు కాస్త నెమ్మదించి 6.7శాతం వద్ద స్థిరపడుతుందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది.

Cyril Ramaphosa: దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా మళ్లీ రామఫోసా

భారత్‌లో ప్రభుత్వ పెట్టుబడుల్లో వృద్ధి అధికంగా ఉండగా.. ప్రైవేటు పెట్టుబడులూ కోలుకుంటున్నట్లు వివరించింది. ఈ ఏడాది ప్రపంచ దేశాల సగటు వృద్ధి రేటు 2.6 శాతంగా ఉంటుందని తెలిపింది. 2025–26లో ప్రపంచ వృద్ధి 2.7 శాతానికి పెరుగుతుందని అంచనా వేసింది. కొవిడ్‌–19 పరిణామాల ముందు దశాబ్దంలో నమోదైన ప్రపంచ వృద్ధి రేటు 3.1శాతం కంటే ఇది తక్కువ కావడం గమనార్హం. 

Switzerland Peace Summit: ఉక్రెయిన్‌లో శాంతికి ప్రాదేశిక సమగ్రతే ముఖ్య భూమిక

#Tags