Earthquake: టిబెట్‌ను వణికించిన భూకంపం.. 126 మంది మృతి

చైనాలోని అటానమస్‌ ప్రాంతం టిబెట్‌లో జ‌న‌వ‌రి 7వ తేదీ ఉదయం తీవ్ర భూకంపం సంభవించింది.

స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9.05 గంటల సమయంలో జరిగిన ఈ భూకంపం, రిక్టర్‌ స్కేలుపై 6.8 తీవ్రతతో నమోదైంది. అయితే.. అమెరికా జియోలాజికల్ విభాగం ప్రకారం, దీనికి 7.1 తీవ్రత ఉండవచ్చని పేర్కొంది.
 
భూకంపం తీవ్రత ఎక్కువగా డింగ్రీ కౌంటీలోని జిగాజె ప్రాంతంలో పడింది. ఈ పరిణామంలో కనీసం 126 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 188 మంది క్షతగాత్రులయ్యారు. ఈ ప్రాంతంలో నివాస భవనాలు కూలడం వంటి ఘటనలు జరిగినాయి. జిగాజె ప్రాంతం (షిగస్తె అని కూడా పిలుస్తారు) భారత్‌తో సరిహద్దుకు సమీపంలో ఉంది. ఇది టిబెట్‌లోని పవిత్ర నగరాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది, అలాగే ఈ నగరంలో పంచన్ లామా నివసించేవారు.

భూకంపం కేంద్రం డింగ్రీ కౌంటీలోని త్సొగో ప్రాంతంలో ఉండగా, భూమికి 10 కిలోమీటర్ల లోతులో సంభవించింది. భూకంపం ప్రభావం, నేపాల్‌కు కూడా చేరింది, అక్కడ కొన్ని ప్రాంతాలలో భవనాలు, చెట్లు, కరెంటు స్తంభాలు కదిలాయి. కఠ్మాండులోనూ భూ ప్రకంపనలు కనిపించాయి, ప్రజలు భయభ్రాంతులకు గురై వీధుల్లోకి పరుగులు తీశారు.

Virus: కరోనా కంటే ముందే.. ప్రపంచాన్ని వణికిస్తున్న 10 వైరస్‌లు ఇవే..

ఈ ఘటనపై, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ స్పందించి, రక్షణ చర్యలను, సహాయక కార్యక్రమాలను ముమ్మరంగా చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఆహార పదార్థాలు, మంచినీరు, కాటన్ టెంట్లు, బేడ్లు, ఇతర అత్యవసర సామగ్రి బాధిత ప్రాంతాలకు పంపబడినట్లు అధికారులు వెల్లడించారు.

#Tags