Clashes at Football Match: ఫుట్‌బాల్ మ్యాచ్‌లో అభిమానుల ఘర్షణ.. 100 మంది మృతి
గినియాలోని రెండవ అతిపెద్ద నగరమైన ఎన్‌జెరెకోర్‌లో ఫుట్‌బాల్ మ్యాచ్ సందర్భంగా అభిమానుల మధ్య భారీ ఘర్షణ జరిగింది. రెండు వర్గాలు పరస్పరం దాడి చేసుకోవడంతో దాదాపు 100 మందికి పైగా మరణించారు. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
కాగా గినియా మిలిటరీ జుంటా నేత మమాడి దౌంబోయ గౌరవార్థం జెరెకొరె నగరంలో డిసెంబర్ 1వ తేదీ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ను నిర్వహించారు. ఫుట్‌బాల్ మ్యాచ్ మధ్యలో రిఫరీ తీసుకున్న ఓ నిర్ణయం వివాదాస్పదమైంది. దాన్ని వ్యతిరేకించిన ఓ జట్టు అభిమానులు మైదానంలోకి దూసుకెళ్లారు. దీంతో అవతలి జట్టు అభిమానులు వీరిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది.
Social Media: సోషల్ మీడియా నియంత్రణకు చట్టాలు చేస్తున్న దేశాలు ఇవే..
అనంతరం వందలాది మంది వీధుల్లోకి వచ్చి పరస్పరం దాడులు చేసుకున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్‌ను కూడా ధ్వంసం చేసి నిప్పంటించారు. ఈ క్రమంలో వంద మందికిపైగా మరణించగా.. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వీధులంతా రక్తసిక్తంగా మారాయి. ఎక్కడ చూసినా మృతదేహాలు చెల్లాచెదురుగా పడిఉన్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Asian Champions Trophy: అరుదైన రికార్డు.. ఆసియా చాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్