Muslim Population: 100 శాతం ముస్లింలు ఉన్న దేశం ఇదే..!

ప్రపంచంలో అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న మతం ఇస్లాం.

2070 నాటికి ఇస్లాంను అనుసరించే వారి సంఖ్య ప్రపంచంలోనే అత్యధికంగా ఉండనున్నదని పలు నివేదికలు చెబుతున్నాయి. ప్యూ రీసెర్చ్ సెంటర్ నివేదిక ప్రకారం 2015తో పోలిస్తే 2060 నాటికి, మొత్తం ప్రపంచ ముస్లింల జనాభా 70 శాతం మేరకు పెరగనుంది.  

భారతదేశానికి పక్కనే ఉన్న మాల్దీవుల జనాభాలో 100 శాతం ముస్లింలు ఉన్నారు. అదే విధంగా ఆఫ్రికన్‌ దేశమైన మారిషస్‌లో 100 శాతం ముస్లిం జనాభా  ఉంది. ట్యునీషియా మొత్తం జనాభాలో 99.8 శాతం మంది ముస్లింలు. సోమాలియా జనాభాలో 99 శాతం మంది ముస్లింను అనుసరిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ వంటి దేశాల్లో కూడా 99 శాతం మంది ఇస్లాంను అనుసరిస్తున్నారు. అత్యధిక ముస్లిం జనాభా ఉన్న దేశాల విషయానికొస్తే ఇండోనేషియా మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత పాకిస్తాన్, భారత్, బంగ్లాదేశ్‌లు ఉన్నాయి.

మాల్దీవులను పన్నెండవ శతాబ్దం వరకు హిందూ రాజులు పరిపాలించారు. తరువాతి కాలంలో ఇది బౌద్ధమతానికి కేంద్రంగా మారింది. తమిళ చోళ రాజులు కూడా ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. ఆ తర్వాత మెల్లగా మాల్దీవులు ముస్లిం దేశంగా మారడం మొదలైంది. మాల్దీవుల అధికారిక మతం ఇస్లాం. ముస్లిమేతరులు ఎవరూ మాల్దీవులలో పౌరసత్వం పొందలేరు. 

Golden Visa: ఆస్ట్రేలియా గోల్డెన్‌ వీసా రద్దు..!

ముస్లిం జనాభాలో ఇండోనేషియా తర్వాత పాకిస్తాన్ రెండో స్థానంలో ఉంది. ఇక్కడ ముస్లింల సంఖ్య 23 కోట్లకు పైగా ఉంది. గత జనాభా లెక్కల ప్రకారం పాకిస్తాన్ మొత్తం జనాభా 18,68,90,601 కాగా, అందులో 18 కోట్ల 25 లక్షల 92 వేల మంది ముస్లింలు. పాకిస్తాన్‌లో హిందువుల సంఖ్య దాదాపు 22,10,000 కాగా, 74 వేలకు పైగా సిక్కులు ఉన్నారు. క్రైస్తవులు దాదాపు 18 లక్షల 73 వేలు, అహ్మదీలు 1,88,340. పార్సీలు దాదాపు 4000 మంది ఉన్నారు. 

ఈ జాబితాలో భారత్ మూడో స్థానంలో ఉంది. భారత్‌లో ముస్లింల జనాభా 20 కోట్లకు పైగానే ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం, భారతదేశంలో 17.22 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు. ఇది దేశ మొత్తం జనాభాలో 14.2 శాతం. ముస్లిం జనాభా వేగంగా పెరుగుతున్న దేశాలలో భారత్‌ ఒకటి. 

బంగ్లాదేశ్‌ నాలుగో స్థానంలో నిలిచింది. ఇక్కడ ముస్లిం జనాభా 15 కోట్లకు పైగానే ఉంది. ఆఫ్రికన్ దేశం నైజీరియా ఐదవ స్థానంలో ఉంది. ఇస్లాం మతాన్ని అనుసరించే 11 కోట్ల మందికి పైగా ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. దీని తర్వాత ఈజిప్ట్ (11 కోట్లు), ఇరాక్, టర్కీ ఉన్నాయి. 

Donald Trump: తొలి ప్రైమరీలో ట్రంప్‌దే గెలుపు.. అత్యధికంగా 51 శాతం ఓట్లు కైవసం

#Tags