RBI: ఐదు బ్యాంకులకు రూ.60.3 లక్షల జరిమానా విధించిందిన ఆర్బీఐ!!

వివిధ నిబంధనలను ఉల్లంఘించినందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఐదు సహకార బ్యాంకులపై మొత్తం రూ.60.3 లక్షల జరిమానా విధించింది.

జరిమానా విధించిన కారణాలు..
➤ RBI జారీ చేసిన నిర్దిష్ట ఆదేశాలను పాటించకపోవడం.
➤ డైరెక్టర్లు, వారి బంధువులకు రుణాలు, అడ్వాన్సులపై నిషేధం ఉల్లంఘించడం.
➤ కొన్ని సంస్థలకు పొదుపు ఖాతాలు తెరవడంపై ఆంక్షలు పాటించకపోవడం.
➤ డిపాజిట్ ఖాతాల నిర్వహణలో లోపాలు.

జరిమానా వివరాలు..
➤ రాజ్‌కోట్ నాగరిక్ సహకార బ్యాంక్: రూ.43.30 లక్షలు
➤ కాంగ్రా కో-ఆపరేటివ్ బ్యాంక్ (న్యూఢిల్లీ): రూ.5 లక్షలు
➤ రాజధాని నగర్ సహకార బ్యాంక్ (లక్నో): రూ.5 లక్షలు
➤ జిలా సహకార బ్యాంక్, గర్వాల్ (కోట్‌ద్వార్, ఉత్తరాఖండ్): రూ.5 లక్షలు
➤ జిల్లా సహకార బ్యాంకు (డెహ్రాడూన్): రూ.2 లక్షలు

RBI: ఆర్‌బీఐ ఉద్గమ్‌ పోర్టల్‌లోకి 30 బ్యాంకులు

#Tags