RBI Repo Rate: రిజర్వ్ బ్యాంక్ రెపో రేటు యథాతథం

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మోనిటరీ పాలసీ కమిటీ (Monetary Policy Committee) సమావేశంలో రేపో రేటుని యథాతథంగా ఉంచుతున్నట్లు RBI గవర్నర్ 'శక్తికాంత దాస్' వెల్లడించారు.
RBI keeps repo rate unchanged

ఆర్‌బీఐ పాలసీ రేట్లలో ఎలాంటి మార్పు చేయకుండా స్థిరంగా ఉంచడం ఇది వరుసగా ఐదోసారి కావడం గమనార్హం. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.

India's Economy: భారత్‌ ఆర్థిక వృద్ధి 6.8 శాతం

దీంతో కీలక వడ్డీ రేట్లను 6.5శాతం దగ్గరే ఉంచాలని మొనేటరీ పాలసీ మీటింగ్​లో ఏకగ్రీవంగా అంగీకరించింది. స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేటును 6.25 శాతం వద్ద, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు, బ్యాంకు రేటును 6.75 శాతం వద్దకే యథాతథంగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

ఆర్‌బీఐ 2023 - 24లో దేశ జీడీపీ వృద్ధిరేటు 6.5 శాతం నుంచి 7 శాతానికి పెంచింది. మూడో త్రైమాసికంలో ఇది 6.5 శాతంగా, నాలుగో త్రైమాసికంలో 6 శాతంగా ఉండొచ్చని తెలుస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి మూడు త్రైమాసికాల్లో వృద్ధి రేటు వరుసగా 6.7 శాతం, 6.5 శాతం, 6.4 శాతంగా ఉండే అవకాశం ఉండొచ్చని సమాచారం.

India Economy: ఐదు ట్రిలియన్‌ ఎకానమీతో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌

#Tags