Skip to main content

RBI Keeps Repo Rate: మళ్లీ వృద్ధికే పెద్దపీట.. 6.5 శాతం వద్దే రెపో రేటు

ధరల స్పీడ్‌ కట్టడి సంకేతాలతో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) వరుసగా రెండోసారి రెపో రేటును 6.5 శాతం (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు) వద్ద యథాతథంగా కొనసాగించింది.
RBI Governor Shaktikanta Das

మూడు రోజులపాటు ప్రస్తుత ఆర్థిక సంవత్సర రెండవ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమావేశాలు నిర్వహించిన గవర్నర్‌ శక్తికాంతదాస్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ నిర్ణయాలు జూన్ 8న‌ వెలువడ్డాయి. 
కొన్ని కీలక నిర్ణయాలు చూస్తే.. 
యథాతథ వృద్ధి రేటు అంచనా 
ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాలను యథాతథంగా 6.5 శాతం వద్ద కొనసాగించింది. ఏప్రిల్‌–జూన్, జూలై–సెప్టెంబర్, అక్టోబర్‌–డిసెంబర్, జనవరి–మార్చి త్రైమాసికాల్లో వరుసగా వృద్ధి రేట్లు 8%, 6.5%, 3.6%, 5.7 శాతంగా కొనసాగుతాయని అంచనావేసింది.  

UPI Activation: ఇక‌పై ఆధార్‌తో కూడా యూపీఐ యాక్టివేషన్‌

మెజారిటీ ‘కఠినం’ వైపే..
‘సరళతర పరపతి ఉపసంహరణ’ విధానం కొనసాగింపునకే ఆరుగురు సభ్యుల్లో ఐదుగురు ఓటు వేశారు. ద్రవ్యోల్బణంపై ఇంకా ఆందోళనకరమైన పరిస్థితి తొలగిపోలేదని తద్వారా ఆర్‌బీఐ ఎంపీసీ సంకేతాలు ఇచ్చింది.  ఒక్కరు మాత్రమే మళ్లీ రేటు తగ్గించవచ్చన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి, అంతర్జాతీయంగా క్రూడ్‌ ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం తీవ్రత నేపథ్యంలో దీర్ఘకాలం 4 శాతంగా ఉన్న రెపో రేటు ఫిబ్రవరిలో వరుసగా ఆరోసారి పెంపుతో 6.5 శాతానికి ఎగబాకింది. గత ఏప్రిల్‌లో జరిగిన తొలి పాలసీ సమీక్షలో అంచనాలకు భిన్నంగా 6.5 శాతం యథాతథం రేటును కొనసాగించింది.   

మరికొన్ని ముఖ్యాంశాలు.. 
☛ సహకార బ్యాంకులు త్వరలో మొండిబకాయిలకు (ఎన్‌పీఏ) సంబంధించి రాజీ సెటిల్‌మెంట్‌లు, రైటాఫ్‌లు చేయగలిగేలా మార్గదర్శకాలు వెలువడనున్నాయి. ఈ తరహా నిర్ణయాలను ఇప్పటి వరకూ  షెడ్యూల్డ్‌ వాణిజ్య బ్యాంకులు, కొన్ని ఎంపిక చేసిన ఎన్‌బీఎఫ్‌సీలు మాత్రమే తీసుకునే వెసులుబాటు ఉంది.  
☛ డిజిటల్‌ రుణాలకు సంబంధించి డిఫాల్ట్‌ లాస్‌ గ్యారెంటీ (డీఎల్‌జీ)పై మార్గదర్శకాలు జారీ. క్రెడిట్‌ డెలివరీ వ్యవస్థ క్రమాభివృద్ధి లక్ష్యంగా ఈ మార్గదర్శకాలు వెలువడ్డాయి.  

Nirmala Sitharaman: ప్రైవేటులోకి మరిన్ని ప్రభుత్వ బ్యాంకులు.. బ్యాంకింగ్‌ ప్రైవేటీకరణ ఆగదన్న నిర్మలా సీతారామన్‌..

☛ నాన్‌–బ్యాంక్‌ ప్రీపెయిడ్‌ పేమెంట్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ (పీపీఐ)  ద్వారా వ్యక్తుల కోసం నిర్దిష్ట ప్రీపెయిడ్‌ ఈ–రూపీ ఓచర్లను జారీ అవకాశాన్ని ఆర్‌బీఐ కల్పించింది. ఈ–రూపీ అనేది ప్రాథమికంగా డిజిటల్‌ వోచర్‌.  ఇది ఒక లబ్ధిదారుడు తన ఫోన్‌లో ఎస్‌ఎంఎస్‌ లేదా క్యూఆర్‌ కోడ్‌ రూపంలో పొందుతాడు. ఇది ప్రీ–పెయిడ్‌ వోచర్‌. ఈ  ప్రీపెయిడ్‌ వోచర్‌ను అంగీకరించే ఏ కేంద్రానికైనా వెళ్లి లబ్దిదారుడు సంబంధిత రిడీమ్‌ చేసుకోవచ్చు. తాజాగా  నాన్‌–బ్యాంక్‌ ప్రీపెయిడ్‌ పేమెంట్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ (పీపీఐ) జారీ చేసేవారికి ఈ–రూపీ వోచర్‌లను జారీ చేయడానికి ఆర్‌బీఐ అనుమతించింది.


ద్రవ్యోల్బణం కట్టడిపైనే దృష్టి.. 
2023–24 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం క్రితం అంచనాలను తగ్గించింది. క్రితం 5.2 శాతం అంచనాలను స్వల్పంగా 5.1 శాతానికి కుదించింది. ఆర్‌బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న 6 శాతంకన్నా (ప్లస్‌ 2 లేదా మైనస్‌ 2తో 4 శాతం ఉండాలి) ఇది 90 బేసిస్‌ పాయింట్లు తక్కువ కావడం గమనార్హం. ద్రవ్యోల్బణం కట్టడిపైనే తన దృష్టి ఉంటుందని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ఉద్ఘాటించారు. దీనిని ఆయన ‘అర్జున గురి’గా అభివర్ణించారు.


1,000 రాదు... 5,00 పోదు.. 
గతేడాది మే నుంచి వ్యవస్థలో ఉన్న రూ.2,000 నోట్ల ఉపసంహరణ ప్రకటన అనంతరం ఇప్పటి వరకూ దాదాపు సగం పెద్ద నోట్లు వెనక్కు వచ్చాయని ఆర్‌బీఐ గవర్నర్‌ తెలిపారు. 2023 మార్చి 31వ తేదీ నాటికి రూ.2,000 నోట్లు వ్యవస్థలో రూ.3.62 లక్షల కోట్లు చెలామణీలో ఉన్నాయి. ఇందులో ఇప్పటికి రూ.1.80 లక్షల కోట్లు వెనక్కు వచ్చేశాయి.  వీటిలో 85 శాతం డిపాజిట్ల ద్వారానే వెనక్కు వచ్చాయన్నారు. రూ.500 నోట్లు వెనక్కు తీసుకోవాలన్న యోచన లేదని, అలాగే కొత్తగా రూ.1,000 నోట్లు తీసుకుని రాబోమని గవర్నర్‌ స్పష్టం చేశారు.  
రూపే ప్రీపెయిడ్‌ ఫారెక్స్‌ కార్డులు.. 
రూపే ప్రీపెయిడ్‌ ఫారెక్స్‌ కార్డులను జారీ చేయడానికి బ్యాంకులకు ఆర్‌బీఐ అనుమతి ఇచ్చింది. విదేశాలకు వెళ్లే భారతీయులకు చెల్లింపుల వెసులుబాటు విస్తరణకు ఈ నిర్ణయం దోహదపడుతుంది. రూపే డెబిట్, క్రెడిట్, ప్రీపెయిడ్‌ కార్డ్‌లు భారత్‌సహా విదేశీ వినియోగానికి ఇక బ్యాంకులు జారీ చేయవచ్చు. 

May Weekly Current Affairs (Economy) Bitbank: భారతదేశం యుపిఐ చెల్లింపు వ్యవస్థలో చేరడానికి ఏ దేశం ఆసక్తి చూపించింది?

Published date : 09 Jun 2023 03:48PM

Photo Stories