RBI Repo Rate: ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. మరోసారి వడ్డీ రేట్లు యథాతథం..!
జూన్ 6న ప్రారంభమైన పరపతి విధాన కమిటీ (MPC) సమావేశ నిర్ణయాలను గవర్నర్ శక్తికాంత దాస్ జూన్ 8న (గురువారం) ప్రకటించారు. రెపోరేటులో ఎలాంటి మార్పు చేయకుండా 6.5% వద్ద కొనసాగించాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ద్రవ్యోల్బణం తగ్గిన్నందువల్ల రెపో రేటుని పెంచలేదని, వడ్డీ రేట్లలో(గృహ, వాహన రుణగ్రహీతలకు ఊరటనిచ్చే అంశం) కూడా ఎలాంటి మార్పు లేదన్నారు. ఆర్‌బీఐ రెపో రేటుని స్థిరంగా ఉంచడం ఇది వరుసగా రెండోసారి.
RBI Annual Report: కట్టలు తెంచుకున్న కరెన్సీ.. ఆర్‌బీఐ వార్షిక నివేదిక వెల్లడి.. వార్షిక నివేదికలోని ముఖ్యాంశాలు..
ఎంఎస్‌ఎఫ్ రేటు 6.75 శాతం, ఎస్‌డీఎఫ్ రేటు 6.25 శాతం, బ్యాంక్ రేటు 6.75 శాతం, రివర్స్ రెపో రేటు 3.35 శాతం, సీఆర్ఆర్ రేటు 4.50 శాతంగా ఉన్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ ప్రకటించారు. గత ఏప్రిల్ సమావేశంలో రెపో రేటు (Repo rate)ను ఎలాంటి మార్పు చేయకుండా 6.5 శాతంగా కొనసాగించారు. ద్రవ్యోల్బణాన్ని (Inflation) నియంత్రించేందుకు 2022 మే నుంచి వరుసగా ఆరు దఫాల్లో రెపో రేటును 250 బేసిస్ పాయింట్ల మేర ఆర్‌బీఐ పెంచింది. కీలక రేట్లపై నిర్ణయాన్ని తీసుకునేందుకు రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలను ఆర్‌బీఐ పరిగణనలోకి తీసుకుంటుంది. ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 18 నెలల కనిష్ఠమైన 4.7 శాతానికి దిగివచ్చిన విషయం తెలిసిందే.
రిటైల్ ద్రవ్యోల్బణం (Inflation) తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఊతమివ్వాల్సిన అవసరం ఉందనే భావనతోనే కీలక రేట్లలో ఆర్‌బీఐ మార్పులు చేయక పోవచ్చునని గతకొంత కాలంగా విశ్లేషణలు వెలువడుతున్న విషయం తెలిసిందే.
RBI: ఆర్‌బీఐ రుణరేటు తగ్గే అవకాశం.. అంతర్జాతీయ ఆర్థిక విశ్లేషణ దిగ్గజం అంచనా..!