Skip to main content

Ignite Fest: ఇగ్నైట్‌ ఫెస్ట్‌లో విద్యార్థుల ప్రతిభ

మొయినాబాద్‌ మండలం తోలుకట్టలో ఉన్న చేవెళ్ల గురుకుల పాఠశాల విద్యార్థులు ఇగ్నైట్‌ ఫెస్ట్‌–2023లో అద్భుత ప్రతిభ‌ కనబర్చారు.
Ignite Fest organised for students  Ignite Fest-2023 highlights  Ignite Fest-2023 highlights

ఇటీవల వికారాబాద్‌ జిల్లాలోని శివారెడ్డిపేట గురుకులంలో ఇటీవల జరిగిన రీజినల్‌ లెవెల్‌ ఇగ్నైట్‌ ఫెస్ట్‌లో భాగంగా కథలు చెప్పడంలో ప్రణిత(ఇంగ్లీష్‌) ద్వితీయ స్థానం, నందిని(తెలుగు) ద్వితీయ స్థానం సాధించారు. పుస్తక సమీక్షలో జే.పూజ(ఇంగ్లీష్‌) ప్రథమ స్థానం, స్కిట్‌ అండ్‌ డ్రామాలో నిహారిక, స్పందన, వి.అమూల్య, కావేరి, వై.అమూల్య, అర్చన, కె.నందిని, రుచిత, హాసిని, ఇందరప్రియదర్శిని గ్రూప్‌ ప్రథమస్థానం, థిమాటిక్‌ డ్రాయింగ్‌లో రాజేశ్వరి మూడోస్థానం, వై.శృతి మూడోస్థానం, బెస్ట్‌ అవుట్‌ ఆఫ్‌ వేస్ట్‌లో మైత్రి ద్వితీయ స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా డిసెంబ‌ర్ 14న (గురువారం) విద్యార్థులను సాంఘిక సంక్షేమ గురుకుల సంస్థ ప్రాంతీయ సమన్వయాధికారి శారద, ప్రిన్సిపాల్‌ రమాదేవి, ఉపాధ్యాయులు అభినందించారు.

Education News: పదో తరగతిలో మెరుగైన ఉత్తీర్ణతే లక్ష్యం.. మొదలైన వంద రోజుల ప్రణాళిక.. ఎక్క‌డంటే..

Published date : 15 Dec 2023 05:42PM

Photo Stories