Drone Didi Yojana: మహిళల సాధికారతకు డ్రోన్ దీదీ యోజనకు శ్రీకారం!

డ్రోన్ దీదీ పైలట్ ప్రాజెక్ట్ కోసం ఎంఎస్‌డీఈ(MSDE)తో మహీంద్రా & మహీంద్రా లిమిటెడ్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

వర్ధమాన సాంకేతిక రంగాల్లో మహిళల సాధికారత దిశగా ఒక ముఖ్యమైన చర్యలో నైపుణ్య అభివృద్ధి, వ్యవస్థాపకత్వ మంత్రిత్వ శాఖ (MSDE) మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ (M&M)తో కలిసి రెండు పైలట్ ప్రాజెక్టులను నిర్వహించడానికి డ్రోన్ దీదీ యోజన కింద ఒక అవగాహన ఒప్పందం (MOU) కుదుర్చుకుంది.

ఈ కార్యక్రమంలో కార్యదర్శి అతుల్ కుమార్ తివారీ, మహీంద్రా గ్రూప్ సీఈఓ & ఎండీ డాక్టర్ అనీష్ షా పాల్గొన్నారు. డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించి వ్యవసాయంలో మహిళలకు కొత్త జీవనోపాధి అవకాశాలను కల్పించడం ఈ ఒప్పందం యొక్క లక్ష్యం.

Peace Memorial, Eco-Park: శాంతి స్మారకం, ఎకో పార్క్ ప్రారంభం.. ఎక్క‌డంటే..
 
➣ డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించి వ్యవసాయంలో మహిళలకు కొత్త జీవనోపాధి అవకాశాలను సృష్టించడం.
➣ డ్రోన్‌లను ఎలా నడపాలో మహిళలకు శిక్షణ ఇవ్వడం.
➣ వ్యవసాయ పనులకు డ్రోన్‌లను ఉపయోగించడం ద్వారా ఉత్పాదకత, లాభదాయకతను పెంచడానికి మహిళలకు సహాయం చేయడం.

#Tags