Kharif Crops: రికార్డు స్థాయిలో ఉన్న ఖరీఫ్ పంటల దిగుబడులు
2024-25 సంవత్సరంలో ఖరీఫ్ పంటల దిగుబడి రికార్డు స్థాయిలో ఉంటుందని కేంద్ర వ్యవసాయ శాఖ అంచనావేసింది.
మొట్టమొదటిసారిగా, డిజిటల్ క్రాప్ సర్వేతో రూపొందించిన ఈ అంచనాలను ఆ శాఖ నవంబర్ 5వ తేదీ విడుదల చేసింది.
దీని ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లో వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ఈ మేరకు ఉత్తరప్రదేశ్‌లో వరి దిగుబడి ఈసారి 217.43 (ఎల్ఎంటీ) లక్ష మెట్రిక్ టన్నుల వరకు ఉంటుందని అంచనా. ఆ తర్వాతి స్థానాల్లో 146.82 ఎల్ఎంటీలతో పంజాబ్, 120.75 ఎల్ఎంటీతో పశ్చిమబెంగాల్, 98.08 ఎల్ఎంటీలతో చత్తీస్ గఢ్ రాష్ట్రాలు ఉన్నాయి. తెలంగాణ 81.74 ఎల్ఎంటీల వరి దిగుబడితో ఐదో స్థానంలో ఉంది.
ఈ అంచనాల ప్రకారం.. 2024-25 ఖరీఫ్‌లో ఆహార ధాన్యాల దిగుబడి 1647.05 ఎల్ఎంటీలుగా ఉంది. ఇది గతేడాది ఖరీఫ్ ఆహారధాన్యాల దిగుబడితో పోలిస్తే 89.37 ఎల్ఎంటీలు అధికం. వరి, జొన్న, మొక్కజొన్నల అధిక ఉత్పత్తి కారణంగా ఆహార ధాన్యాల దిగుబడి రికార్డు స్థాయిలో పెరిగింది.
#Tags