Skip to main content

Sharda Sinha: ‘స్వర కోకిల’ శారదా సిన్హా కన్నుమూత

ప్రముఖ జానపద గాయని శారదా సిన్హా(72) ఢిల్లీలోని ఎయిమ్స్‌లో న‌వంబ‌ర్ 5వ తేదీ తుది శ్వాస విడిచారు.
Renowned Folk and Classical Singer Sharda Sinha Passes Away

శారదా సిన్హా ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడంతో ఆమెను వెంటిలేటర్ సపోర్టుపై ఉంచారు. న‌వంబ‌ర్ 6వ తేదీ పట్నాలో ప్రభుత్వ లాంఛనాలతో శారదా సిన్హా అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

ఆమెను బీహార్‌కు చెందిన ‘స్వర కోకిల’ అని కూడా పిలుస్తారు. శారదా సిన్హా భర్త బ్రెయిన్ హెమరేజ్‌తో ఇటీవలే కన్నుమూశారు. శారదా సిన్హా 1952 అ‍క్టోబర్‌ ఒకటిన బీహార్‌లోని సుపాల్ జిల్లాలోని హులాస్‌లో జన్మించారు. ఆమె సంగీతంలో ఎంఏ చేశారు. ఆమెకు ఇద్దరు పిల్లలు. కుమారుని పేరు అన్షుమన్ సిన్హా, కుమార్తె పేరు వందన.

శారదా.. 1970ల నుంచి సంగీత రంగంలో పనిచేస్తున్నారు. భోజ్‌పురి, మైథిలి, హిందీ ఫోక్ సంగీతానికి గణనీయమైన సేవలందించారు. హృద్యమైన ఫోక్ సంగీత ప్రదర్శనలకు ప్రశంసలు అందించిన ఆమె 1991లో పద్మశ్రీ, 2018లో పద్మ భూషణ్‌ అవార్డులు అందుకున్నారు.

Movva Rama Rao: ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ మొవ్వా మృతి

Published date : 06 Nov 2024 03:08PM

Photo Stories