Employment Generation: 2030 నాటికి 14.8 కోట్ల ఉద్యోగాలు సృష్టించాలి.. లేక‌పోతే..

ఉద్యోగాల కల్పనకు సంబంధించి జీ20 దేశాలతో పోలిస్తే భారత్‌ చాలా వెనకబడి ఉందని ఐఎంఎఫ్ డిప్యూటీ డైరెక్టర్‌ గీతాగోపీనాత్ అన్నారు.

‘ఉపాధి కల్పనలో భారత్‌ జీ20 దేశాలలో వెనుకబడి ఉంది. జనాభా పెరుగుదల దృష్ట్యా 2030 నాటికి దేశం అదనంగా 14.8 కోట్ల ఉద్యోగాలను సృష్టించాల్సిన అవసరం ఉంది’ అని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) ఫస్ట్‌ డెప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ గీతా గోపీనాథ్ తెలిపారు.
 
2010–20 మధ్య భారత్‌ సగటున 6.6 శాతం వృద్ధిని సాధించిందని, అయితే ఉపాధి రేటు 2 శాతం కంటే తక్కువగా ఉందని ఢిల్లీ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌ వజ్రోత్సవంలో పాల్గొన్న సందర్భంగా గీత చెప్పారు. అయితే ఉద్యోగకల్పన రేటు మాత్రం 2 శాతం లోపే ఉంది. కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌తో కలిసి పాల్గొన్న ఆమె ఈమేరకు వ్యాఖ్యలు చేశారు.

Microsoft: ఉద్యోగులను ఆకర్షిస్తున్న నంబర్‌1 టెక్‌ దిగ్గజం ఇదే..

మరిన్ని ఉద్యోగాలను సృష్టించేందుకు ప్రైవేట్‌ పెట్టుబడులు పెరగాల్సిన అవసరం ఉందని అన్నారు. వ్యాపారాన్ని మరింత సులభతరం చేయడం, నియంత్రణ వాతావరణాన్ని మెరుగుపరచడం, ట్యాక్స్‌ బేస్‌ను విస్తృతం చేయడం అవసరమని తెలిపారు. ప్రపంచ సరఫరా వ్యవస్థలో భారత్‌ ఒక కీలక దేశంగా ఉండాలనుకుంటే దిగుమతి సుంకాలను తగ్గించాల్సిందేనని స్పష్టం చేశారు.

అలాగే.. భారత్‌తో పోటీ పడుతున్న ఇతర దేశాలతో పోలిస్తే స్థానికంగా దిగుమతి సుంకం అధికంగా ఉంది. దాన్ని తగ్గించాలి. కార్మిక చట్టాలను సమర్థంగా అమలు చేయాలి. ఇటీవల ప్రవేశపెట్టిన ‘మూలధన లాభాలపై పన్ను’ తాత్కాలికంగా ఖజానాకు డబ్బు సమకూర్చవచ్చు. కానీ అది భవిష్యత్తులో క్లిష్టంగా మారే అవకాశం ఉంది. జీఎస్టీ రేట్లను మరింత సరళీకరిస్తే అదనంగా 1.5 శాతం జీడీపీ వృద్ధికి అవకాశం ఉంద‌ని ఆమె అన్నారు.

Union Budget: ‘ఉద్యోగ కల్పన.. నైపుణ్య శిక్షణ‌’.. యువతకు రూ.2 లక్షల కోట్లు..

#Tags