Lakshadweep: లక్షద్వీప్‌లో మొదటి ప్రైవేట్ రంగ శాఖను ప్రారంభించిన బ్యాంక్ ఇదే..

భారతదేశంలోని ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ(HDFC) లక్షద్వీప్‌లోని కవరత్తి ద్వీపంలో ఒక శాఖను ప్రారంభించింది.

ఈ శాఖ యూనియన్ టెరిటరీలో ఉనికి కలిగి ఉన్న ఏకైక ప్రైవేట్ రంగ బ్యాంక్‌గా నిలిచింది. ఈ బ్యాంకు శాఖ ప్రారంభంతో లక్షద్వీప్‌లో బ్యాంకింగ్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది.

➤ ఈ కొత్త శాఖ వ్యక్తిగత ఖాతాల వెపెట్టుబడి, రుణాలు, డిపాజిట్లతో సహా విస్తృత శ్రేణి వ్యక్తిగత బ్యాంకింగ్ సేవలను అందిస్తుంది. వ్యాపార ఖాతాలను తెరవడం, రుణాలు, క్రెడిట్ సదుపాయాలను పొందడం వంటి వ్యాపారాలకు అవసరమైన సేవలను కూడా అందిస్తుంది.

➤ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లక్షద్వీప్‌లోని ప్రజలకు, ముఖ్యంగా రిటైలర్‌లకు QR కోడ్ ఆధారిత చెల్లింపులు వంటి అనుకూలీకరించిన డిజిటల్ బ్యాంకింగ్ పరిష్కారాలను అందిస్తుంది.

➤ 2023 డిసెంబర్ 31 నాటికి, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు 3,872 నగరాలు, పట్టణాల్లో 8,091 బ్రాంచ్‌లు, 20,688 ఏటీఎంలు ఉన్నాయి.

  • HDFC బ్యాంక్ CEO: శశిధర్ జగదీశన్ (27 అక్టోబర్ 2020 - ప్రస్తుతం)
  • HDFC బ్యాంక్ స్థాపన: ఆగస్టు 1994, ముంబై
  • HDFC బ్యాంక్ ప్రధాన కార్యాలయం: ముంబై

New Currency: ఆర్థిక గందరగోళం తర్వాత కొత్త కరెన్సీ ప్రారంభం.. ఎక్క‌డంటే..

#Tags