Economic Survey: ఫార్మా, ఎయిర్‌కార్గోలో తెలంగాణ సూపర్‌!

భార‌త‌దేశంలో ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చేందుకు చర్యలు చేపట్టిన రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని కేంద్ర ఆర్థిక సర్వే వెల్లడించింది.

తెలంగాణ, ఏపీతోపాటు పలు ఇతర రాష్ట్రాల్లో స్థూల ద్రవ్యలోటు, ఆర్థిక లోటు తగ్గాయని పేర్కొంది. ముఖ్యంగా మూలధన పెట్టుబడులపై ఈ రాష్ట్రాలు దృష్టి సారించడంతో.. మెరుగ్గా ఖర్చు చేసే పరిస్థితి ఏర్పడిందని తెలిపింది. జూలై 22వ తేదీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2023–24 ఆర్థిక సర్వే నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 

✔️ దేశ ఫార్మా ఉత్పత్తుల్లో తెలంగాణ వాటా 30 శాతానికిపైగా ఉందని, వెయ్యికిపైగా లైఫ్‌ సైన్సెస్‌ కంపెనీలకు వేదికగా మారిందని కేంద్రం తెలిపింది.
✔️ దేశవ్యాప్తంగా విమానాల ద్వారా సరుకుల రవాణా (ఎయిర్‌ కార్గో)లో  హైదరాబాద్‌ 44 శాతంతో టాప్‌లో నిలిచిందని వెల్లడించింది. 

✔️ 2019–21 మధ్య దేశ వయోజన జనాభాలో ఊబకాయం ఆందోళనకర స్థాయికి పెరిగిందని.. తెలంగాణలో పురుషుల్లో ఊబకాయం 24.2% నుంచి 32.3 శాతానికి.. మహిళల్లో 28.6% నుంచి 30.1శాతానికి పెరిగిందని తెలిపింది.
✔️ వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాల కోసం తెచ్చిన ఈ–నామ్‌తో తెలంగాణలోని 89 శాతం మంది రైతులు మెరుగైన ధర పొందారని పేర్కొంది. 

Heavy Water Plant: దేశంలోనే ఉత్పత్తి, ఎగుమతుల్లో ముందంజలో ఉన్న వాటర్‌ ప్లాంట్ ఇదే..

✔️ దేశంలో సిమెంట్‌ పరిశ్రమల వార్షిక స్థాపిత ఉత్పత్తి సామర్థ్యం 622 మిలియన్‌ టన్నులకు చేరిందని.. అందులో 85 శాతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక తదితర రాష్ట్రాల్లోనే ఉందని తెలిపింది. 
✔️ ఇక ప్లాస్టిక్‌ నియంత్రణలో భాగంగా సిద్దిపేటలో అమలు చేస్తున్న ‘స్టీల్‌ బ్యాంక్‌’ విధానాన్ని కేంద్రం ప్రశంసించింది.

#Tags