World Press Freedom Day 2024: మే 3వ తేదీ ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం.. ఈ ఏడాది థీమ్ ఇదే..

ప్రతి సంవత్సరం మే 3వ తేదీ ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం జరుపుకుంటారు.

మానవ హక్కుల ప్రాముఖ్యత, వాటిని పరిరక్షించడం, ప్రజాస్వామ్యాన్ని కాపాడటం, ప్రభుత్వాలు మంచి పాలనను అందించడంలో పత్రికారంగం కీలక పాత్ర పోషిస్తోంది. 

ఈ సంవత్సరం యొక్క థీమ్ ‘ఎ ప్రెస్ ఫర్ ది ప్లానెట్: జర్నలిజం ఇన్ ది ఫేస్ ఆఫ్ ది ఎన్విరాన్‌మెంటల్ క్రైసిస్ (A Press for the Planet: Journalism in the Face of the Environmental Crisis).’

1993లో ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభ మే 3వ తేదీని ప్రపంచ స్వాతంత్య్ర పత్రికా దినోత్సవంగా ప్రకటించింది. 1991లో యునెస్కో 26వ సర్వసభ్య సమావేశంలో చేసిన సిఫారసుల తర్వాత ఈ ప్రకటన వెలువడింది. 1991 విండ్ హోక్ డిక్లరేషన్ ఫలితంగా కూడా ఈ ప్రకటన వచ్చింది. 

National Civil Services Day: ఏప్రిల్ 21వ తేదీ జాతీయ పౌర సేవల దినోత్సవం.. ఈ రోజు ప్ర‌త్యేక‌త‌లు ఇవే..

ఇది పత్రికా స్వేచ్ఛ గురించి ఆఫ్రికన్ పాత్రికేయులు తయారు చేసిన ప్రకటన. యునెస్కో నిర్వహించిన ఒక సెమినార్‌లో సమర్పించబడి మే 3న‌ ముగిసింది. దీంతో ఆ రోజును పత్రికా స్వేచ్ఛ దినోత్సవంగా జరుపుకుంటారు.

2023వ‌ సంవత్సరానికి సంబంధించి పత్రికా స్వేచ్ఛ సూచికలో భారత్ 161  స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 400కి పైగా టీవీ న్యూస్‌‌ చానళ్లు ఉన్నాయి. ప‌త్రిక‌లైతే వేల‌ల్లో ఉన్నాయి. ప్రాంతీయ ప్రతికా స్వేచ్ఛ సూచీలో నార్వే, ఐర్లాండ్‌, డెన్మార్క్ మొదటి మూడు స్థానాల్లో ఉండగా చివరి స్థానంలో నార్త్‌‌ కొరియా ఉంది.

 

Ayushman Bharat Diwas 2024: ఏప్రిల్ 30న‌ ఆయుష్మాన్ భారత్ దివాస్

#Tags