World Environment Day: జూన్ 5వ తేదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం.. ఈ ఏడాది థీమ్ ఇదే..

ప్రతి సంవ‌త్స‌రం జూన్ 5వ తేదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జ‌రుపుకుంటారు.

1972లో ఐక్యరాజ్యసమితి నిర్వహించిన పర్యావరణ పరిరక్షణ సదస్సుకు స్వీడన్‌  ఆతిథ్యం ఇచ్చింది. వాతావరణ మార్పులను గమనించి, అవసరమైన చర్యలు చేపట్టాల్సిన అవసరముందని అప్పుడు తొలిసారిగా గుర్తించారు. 1973 నుంచి జూన్‌ 5ను ప్రపంచ పర్యావరణ దినంగా జరుపుకుంటూ వస్తున్నాం. ఈ సందర్భంగా ఐరాస ఎన్విరాన్‌ మెంట్‌ ప్రోగ్రాం(యూఎన్‌ఈపీ) ఏటా ఏదో ఒక అంశంతో పర్యావరణంపై ప్రజల్లో అవగాహన పెంచే ప్రయత్నాలు చేస్తోంది. 

ఈ ఏడాది థీమ్ ఇదే..
ఈ ఏడాది థీమ్ ‘భూమి పునరుద్ధరణ, ఎడారీకరణ, కరువు స్థితిస్థాపకత(Land Restoration, Desertification, and Drought Resilience)’. ఇది ఆరోగ్యకరమైన భూమిని తిరిగి తీసుకురావడం, నీటి కొరతను నిర్వహించడం వంటి వాటితో ముడిపడి ఉడాలని పిలుపునిచ్చింది. చెట్లు, ఆరోగ్యకరమైన నేల, స్వచ్ఛమైన నీరు ఘన గ్రహం కోసం అత్యవసరమ‌ని చెబుతోంది.

World Hunger Day 2024:  'ప్రపంచ ఆకలి దినోత్సవం'.. ఈ ఏడాది థీమ్ ఇదే..

#Tags