International Tiger Day 2024: జూలై 29వ తేదీ అంతర్జాతీయ పులుల దినోత్సవం

ప్రపంచవ్యాప్తంగా జూలై 29వ తేదీ అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని జ‌రుపుకుంటారు.

అంతర్జాతీయ పులుల దినోత్సవం 2010 సంవత్సరంలో ప్రారంభమైంది. రష్యాలో జరిగిన టైగర్ సమ్మిట్ దాదాపు 13 దేశాలు పాల్గొని పులుల సంరక్షణపై చర్చించి,  ప్రతి సంవత్సరం జూలై 29వ తేదీ అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించారు. 

నిరంతరం తగ్గుతున్న పులుల సంఖ్యకు పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడమే ఈ దినోత్సవం యొక్క‌ ఉద్దేశం. ప్ర‌స్తుతం ప్రపంచంలోని 70 శాతం పులులు భారతదేశంలోనే ఉన్నట్లు స‌మాచారం. భారత ప్రభుత్వం 1973లో భారతదేశంలో ప్రాజెక్ట్ టైగర్‌ను ప్రారంభించింది. పులి శాస్త్రీయ నామం.. 'పాంథేరా టైగ్రిస్'గా ఉంది. 

➤ భారతదేశంలో మొత్తం పులుల సంరక్షణ కేంద్రాలు 53 ఉన్నాయి.
➤ పులుల సంఖ్య రెట్టింపు చేయాలనే లక్ష్యాన్ని 2022లోనే భారత్ సాధించింది.
➤ 2022 నాటికి పులుల సంఖ్య: 3,167
➤ మహారాష్ట్రలోని పెంచ్ నేషనల్ పార్క్.. టీఎక్స్‌2(TX2) అవార్డును అందుకున్న మూడు సంరక్షణ కేంద్రాలలో ఒకటి.

➤ హర్యాణాలోని కలేసర్ నేషనల్ పార్క్‌లో 10 సంవత్సరాల తర్వాత పులి కనిపించింది.
➤ పెంచ్ టైగర్ రిజర్వ్.. అడవి మంటల నివారణకు ఏఐ(AI)ని ఉపయోగిస్తోంది. 
➤ 'క్లౌడెడ్ టైగర్ క్యాట్' అనేది బ్రెజిల్ రెయిన్‌ఫారెస్ట్‌లలో కనుగొనబడిన కొత్త జాతి
➤ ఒడిశాలో ప్రపంచంలోనే తొలి నల్ల పులి సఫారీ ఏర్పాటు చేయ‌నున్నారు.

World Population Day 2024: జూలై 11వ తేదీ ప్రపంచ జనాభా దినోత్సవం.. ఈ ఏడాది థీమ్ ఇదే..

#Tags