Republic Day 2022: అశోక చక్ర అవార్డును ఎవరికి ప్రదానం చేశారు?

జమ్ము, కశ్మీర్‌కు చెందిన పోలీసు అధికారి బాబూరామ్‌ మరణానంతరం అశోక చక్ర అవార్డుకు ఎంపికయ్యారు. న్యూఢిల్లీలో జరిగిన 73వ గణతంత్ర వేడుకల్లో ఆయన భార్య రీనారాణి, కుమారుడు మాణిక్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అవార్డును అందజేశారు. జమ్మూలోని పూంఛ్‌ జిల్లాకు చెందిన బాబూ రామ్‌ 1999లో పోలీస్‌ శాఖలో కానిస్టేబుల్‌గా చేరారు. 2002 శ్రీనగర్‌లో స్పెషల్‌ ఆపరేషన్స్‌ గ్రూప్‌లో బాధ్యతలు చేపట్టి, 14 ఎన్‌కౌంటర్లలో పాల్గొని 28 మంది ఉగ్రవాదులను అంతమొందించడంలో కీలకంగా ఉన్నారు.

2020 ఆగస్టులో..

2020 ఆగస్టు నెలలో శ్రీనగర్‌లో జరిగిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లో అసిస్టెంట్‌ సబ్‌ ఇనస్పెక్టర్‌ బాబూరామ్‌ అమరుడయ్యారు. ఆరోజు ఆయన చాకచక్యంగా వ్యవహరించి ఉగ్రవాదులున్న ఇంటిపక్క పౌరులను కాపాడారు. అనంతరం ధైర్యంగా ఉగ్రవాదులను పట్టుకునేందుకు ప్రయత్నించి ఎదురు కాల్పుల్లో వీరమరణం పొందారు. ఈ సాహసానికి ఆయనకు మరణానంతరం అత్యున్నత గాలెంటరీ పురస్కారాల్లో ఒకటైన అశోక చక్ర దక్కింది. కాగా, శౌర్యచక్ర అవార్డు మరణానంతరం సుబేదార్‌ శ్రీజిత్, హవల్దార్‌ అనిల్‌ కుమార్, కాశీరాయ్, పింకు కుమార్, జశ్వంత్‌ కుమార్‌ రెడ్డికి దక్కింది.  

చ‌ద‌వండి: క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ పురస్కారానికి ఎంపికైన భారతీయురాలు?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
జమ్ము, కశ్మీర్‌కు చెందిన పోలీసు అధికారి బాబూరామ్‌కు మరణానంతరం అశోక చక్ర అవార్డు ప్రదానం
ఎప్పుడు : జనవరి 26
ఎవరు    : రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌
ఎక్కడ    : న్యూఢిల్లీలో జరిగిన 73వ గణతంత్ర వేడుకల్లో..
ఎందుకు : ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌ సందర్భంగా చేసిన సాహసానికి..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

#Tags