Nobel Prize: వైద్యశాస్త్రంలో ఇద్దరు అమెరికన్లకు నోబెల్ బహుమతి

ప్రపంచ ప్రఖ్యాత నోబెల్ బహుమతుల ప్రకటన నేడు (అక్టోబ‌ర్ 7వ తేదీ) మొదలైంది.

ఈ ఏడాది వైద్యశాస్త్రంలో అసాధారణ పరిశోధన చేసిన ఇద్దరు అమెరికన్ డాక్టర్లకు నోబెల్ బహుమతి వరించింది. విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రవ్కూన్ అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికయ్యారు. కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్లో నోబెల్ అసెంబ్లీ ఈ ప్రకటన చేసింది. 

మైక్రో ఆర్ఎన్ఏను కనుగొన్నందుకు, అలాగే ట్రాన్స్ క్రిప్షన్ తర్వాత జన్యు వ్యక్తీకరణను నియంత్రించడంలో దాని పాత్రపై దృష్టి సారించినందుకు వీరిద్దరికీ ప్రతిష్టాత్మక పురస్కారం వరించింది. 
 
ఇప్పటివరకు వైద్యశాస్త్రంలో 227 మంది నోబెల్ బహుమతి అందుకున్నారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్దంతి రోజైన డిసెంబర్ 10వ తేదీ గ్రహీతలకు బహుమతితో పాటు, లక్ష డాలర్లను అందిస్తారు.

Mithun Chakraborty: మిథున్‌ చక్రవర్తికి 'దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు'

#Tags