National Award: సీహెచ్‌ఓ యామినీకి జాతీయ అవార్డు

గ్రామీణ ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించినందుకు గాను కృష్ణా జిల్లా వణుకూరు–2 డాక్టర్‌ వైఎస్సార్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌(వెల్నెస్‌ సెంటర్‌)లో కమ్యునిటీ హెల్త్‌ ఆఫీసర్‌(సీహెచ్‌వో)గా పనిచేస్తున్న మంత్రి ప్రగడ యామినీకి కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నుంచి జాతీయ అవార్డు లభించింది.

ఫిబ్ర‌వ‌రి 8వ తేదీ న్యూఢిల్లీలో నిర్వహించిన సుశృత అవార్డుల పంపిణీ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ చేతుల మీదుగా ఆమె అవార్డు అందుకున్నారు.

దేశ వ్యాప్తంగా హెల్త్‌కేర్‌ రంగంలో అత్యుత్తమ సేవలు అందించిన 53 మందికి కేంద్ర ప్రభుత్వం సుశృత అవార్డులు అందజేయగా, మన రాష్ట్రం నుంచి యామిని ఒక్కరే ఈ అవార్డును అందుకున్నారు. విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లో మిడ్‌లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌(ఎంఎల్‌హెచ్‌పీ)/కమ్యూనిటీహెల్త్‌ ఆఫీసర్‌(సీహెచ్‌ఓ) కేటగిరిలో ఈ అవార్డు వరించింది. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ వైద్యానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. విలేజ్‌ హెల్త్‌ క్లినిక్స్‌కు అధునాతన భవన నిర్మాణాలు చేపట్టింది. దీంతో ఇప్పటికే ఆమె పనిచేస్తున్న విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌కు నేషనల్‌ క్వాలిటీ ఎస్యురెన్స్‌ స్టాండర్డ్‌ సర్టిఫికేషన్‌(ఎన్‌క్యూఏఎస్‌ఎస్‌) లభించింది. ఇప్పుడు అదే సెంటర్‌లో పనిచేస్తున్న సీహెచ్‌ఓకు జాతీయ గుర్తింపు లభించింది.

Bharata Ratna: 'భారతరత్న'కు ఎంపికైన ఐదుగురూ 'పంచరత్నాలు'.. వారికి ఉండే సౌకర్యాలు ఇవే..

#Tags