Medical Devices Policy: మెడికల్ డివైసెస్ పాలసీకి కేంద్రం ఆమోదం
Sakshi Education
వైద్య పరికరాల తయారీ రంగాన్ని దేశీయంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో కేంద్ర మంత్రివర్గం నేషనల్ మెడికల్ డివైసెస్ పాలసీకి ఆమోదం తెలిపింది. కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సూక్ మాండవీయ ప్రకటన ప్రకారం–ఆరు వ్యూహాలపై ఈ పాలసీ దృష్టిని సారించి కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తుందని తెలిపారు. ప్రస్తుతం 11 బిలియన్ యూఎస్ డాలర్ల టర్నోవర్ ఉన్న ఈ రంగాన్ని.. రానున్న ఐదేళ్లలో 50 బిలియన్ యూఎస్ డాలర్లకు అభివృద్ధి చేయాలన్నది లక్ష్యమన్నారు. దేశంలో వైద్య పరికరాలకు ఎంతో డిమాండ్ ఉందని, దేశీయంగానే తయారీని చేపడితే.. ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అవసరం తగ్గడమే కాక.. విదేశీమారక ద్రవ్యం ఆదా అవుతుందని తెలిపారు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 09 May 2023 06:31PM