Grammys Winners 2022: గ్రామీ పురస్కారం గెలుచుకున్న భారత సంతతి కళాకారులు?
సంగీత ప్రపంచంలో అత్యుత్తమమైన గ్రామీ పురస్కారాలు ఇద్దరు భారత సంతతి కళాకారులకు దక్కాయి. ముంబైలో జన్మించి, అమెరికాలో స్థిరపడిన ఫల్గుణీ షా(ఫలు)తోపాటు అమెరికాలో భారత సంతతికి చెందిన రిక్కీ కెజ్ గ్రామీ పురస్కారాలు అందుకున్నారు. అమెరికాలోని లాస్‌ఏంజెలెస్ నగరంలో 2022 సంవత్సరానికి 64వ వార్షిక గ్రామీ అవార్డుల ప్రదానోత్సవాన్ని ఏప్రిల్ 3న నిర్వహించారు.
Grammy Awards 2022: గ్రామీ అవార్డుల విజేతల పూర్తి జాబితా..
బెస్ట్ న్యూ ఏజ్ ఆల్బమ్..
పోలీసు డ్రమ్మర్ స్టీవార్ట్ కోప్‌లాండ్‌తో కలిసి రిక్కీ కెజ్ ‘డివైన్ టైడ్స్’ ఆల్బమ్ రూపొందించారు. వీరు బెస్ట్ న్యూ ఏజ్ ఆల్బమ్ కేటగిరీలో గ్రామీని స్వీకరించారు. రిక్కీ కెజ్ ఈ పురస్కారం అందుకోవడం ఇది రెండోసారి. స్టీవార్ట్‌కు ఇది ఆరో గ్రామీ. రిక్కీ కెజ్ 2015లో ‘విండ్స్ ఆఫ్ సంసార’ అనే ఆల్బమ్‌కుగాను తొలిసారి గ్రామీ పురస్కారం స్వీకరించారు. ఇక ‘ఏ కలర్‌ఫుల్ వరల్డ్’ అనే ఆల్బమ్‌ను రూపొందించిన ఫలు.. బెస్ట్ చిల్డ్రన్ మ్యూజిక్ ఆల్బమ్ కేటగిరీలో గ్రామీ అవార్డు అందుకున్నారు.
Order of British Empire 2021: ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్‌ను అందుకున్న భారతీయుడు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : గ్రామీ పురస్కారం గెలుచుకున్న భారత సంతతి కళాకారులు?
ఎప్పుడు : ఏప్రిల్ 3
ఎవరు : ఫల్గుణీ షా(ఫలు), రిక్కీ కెజ్
ఎక్కడ : లాస్ ఏంజెలెస్, అమెరికా
ఎందుకు : సంగీతంలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్