Skip to main content

Order of British Empire 2021: ఆర్డర్‌ ఆఫ్‌ ది బ్రిటిష్‌ ఎంపైర్‌ను అందుకున్న భారతీయుడు?

Order of British Empire-2021

బ్రిటిష్‌ రెండో అత్యున్నత ర్యాంకింగ్‌ అవార్డు ‘ఆర్డర్‌ ఆఫ్‌ ది బ్రిటిష్‌ ఎంపైర్‌–2021’ను హైదరాబాద్‌లోని ఉషాలక్ష్మి రొమ్ము వ్యాధుల కేంద్రం డైరెక్టర్, ఉషాలక్ష్మి బ్రెస్ట్‌ కేన్సర్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపక సీఈఓ డాక్టర్‌ పి.రఘురామ్‌ అందుకున్నారు. ఇంగ్లండ్‌ రాజధాని లండన్‌ సమీపంలోని విండ్సర్‌ క్యాసిల్‌లో మార్చి 30న జరిగిన వేడుకలో ప్రిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌ ప్రిన్స్‌ చార్లెస్‌ ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈ అవార్డును అందుకున్న అత్యంత పిన్నవయస్కుడిగా ఆయన ఘనత సాధించారు. భారత్‌లో రొమ్ము కేన్సర్‌ నుంచి సంరక్షణ, శస్త్ర చికిత్స విద్యను మెరుగుపరచడం, యూకే–భారత్‌ మధ్య సత్సంబంధాలకు అత్యుత్తమ సేవలు అందించినందుకు రఘురామ్‌ ఈ అవార్డును పొందారు. రఘురామ్‌ అత్యంత చిన్నవయసులో 2015లో పద్మశ్రీని, 2016లో బీసీ రాయ్‌ నేషనల్‌ అవార్డును అప్పటి రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. 

Oscars Winners 2022: 94వ అకాడమీ అవార్డుల పూర్తి జాబితా

ప్రస్తుతం తమిళనాడు గవర్నర్‌గా ఎవరు ఉన్నారు?
ఎమర్జెన్సీ అండ్‌ క్రిటికల్‌ కేర్‌ విభాగంలో విజయనగరం జిల్లా గరివిడి పశు వైద్యశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ రమేష్‌ పుచ్చకాయల గోల్డ్‌ మెడల్‌ అందుకున్నారు. 2016–19 మధ్య చెన్నైలోని మద్రాసు వెటర్నరీ కళాశాలలో పెంపుడు కుక్కలలో కిడ్నీ సంబంధిత వ్యాధులు, అత్యాధునిక డయాలసిస్‌ చికిత్స (సీఆర్‌ఆర్‌టీ) పద్ధతులపై చేసిన పరిశోధనలకు గానూ రమేష్‌కు ఈ మెడల్‌ వచ్చింది. తమిళనాడు వెటర్నరీ అండ్‌ ఏనిమల్‌ సైన్సెస్‌ వర్సిటీ 22వ స్నాతకోత్సవం సందర్భంగా చెన్నైలో మార్చి 30న జరిగిన కార్యక్రమంలో రమేష్‌కు  తమిళనాడు గవర్నర్‌ రవీంద్రనారాయణ గోల్డ్‌మెడల్‌ అందజేశారు.

Padma Awards 2022: పద్మ అవార్డుల ప్రదానోత్సవం

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఆర్డర్‌ ఆఫ్‌ ది బ్రిటిష్‌ ఎంపైర్‌–2021ను అందుకున్న భారతీయుడు?
ఎప్పుడు : మార్చి 30
ఎవరు    : ఉషాలక్ష్మి బ్రెస్ట్‌ కేన్సర్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపక సీఈఓ డాక్టర్‌ పి.రఘురామ్‌
ఎక్కడ    : విండ్సర్‌ క్యాసిల్, ఇంగ్లండ్‌
ఎందుకు : భారత్‌లో రొమ్ము కేన్సర్‌ నుంచి సంరక్షణ, శస్త్ర చికిత్స విద్యను మెరుగుపరచడం, యూకే–భారత్‌ మధ్య సత్సంబంధాలకు అత్యుత్తమ సేవలు అందించినందుకు..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 31 Mar 2022 04:17PM

Photo Stories