69th National Film Awards ceremony 2023: 69వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్ర‌దానం చేసిన‌ రాష్ట్రపతి

69వ జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో అంగరంగ వైభవంగా జరిగింది.
69th National Film Awards ceremony 2023

రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా అవార్డు గ్ర‌హిత‌లు త‌మ అవార్డులను అందుకున్నారు.  తెలుగు హీరో అల్లు అర్జున్ 'పుష్ప' చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా  అవార్డు  అందుకున్నాడు. 

Nobel Prize 2023 Winners List: నోబెల్ బహుమతి-2023 విజేతల పూర్తి జాబితా ఇదే...

ఆలాగే 'ఉప్పెన'కి బుచ్చిబాబు, 'పుష్ప' సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, 'ఆర్ఆర్ఆర్' సినిమాకుగాను నేపథ్య సంగీతానికి కీరవాణి, కొరియోగ్రఫీకి ప్రేమ్ రక్షిత్, స్పెషల్ ఎఫెక్ట్స్‌కి శ్రీనివాస్ మోహన్, ప్లే బ్యాక్ సింగర్ కాలభైరవ, స్టంట్ కొరియోగ్రఫీకి కింగ్ సోలమన్ 'కొండపొలం' పాటకు చంద్రబోస్ అవార్డులు అందుకున్నారు. 

జాతీయ అవార్డుల పూర్తి జాబితా ఇదే 

ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (పుష్ప)
ఉత్తమ నటి: ఆలియా భట్ (గంగూబాయి) & కృతిసనన్ (మిమీ)
ఉత్తమ సహాయ నటి: పల్లవి జోషి (ద కశ్మీరీ ఫైల్స్ - హిందీ)
ఉత్తమ సహాయ నటుడు: పంకజ్ త్రిపాఠీ (మిమీ- హిందీ)
ఉత్తమ దర్శకుడు: నిఖిల్ మహాజన్ (గోదావరి - మరాఠీ సినిమా)
ఉత్తమ సంగీత దర్శకుడు (సాంగ్స్‌): పుష్ప- దేవిశ్రీ ప్రసాద్
ఉత్తమ మ్యూజిక్‌ డైరెక్టర్‌ (బీజీఎమ్‌) :  ఆర్ఆర్ఆర్- ఎమ్.ఎమ్ కీరవాణి
బెస్ట్‌ ఫీచర్‌ ఫిలిం: రాకెట్రీ: ద నంబీ ఎఫెక్ట్ (హిందీ)

ఉత్తమ పిల్లల చిత్రం: గాంధీ & కో (గుజరాతీ)
ఉత్తమ కొరియోగ్రఫీ: ఆర్ఆర్ఆర్-ప్రేమ్ రక్షిత్
ఉత్తమ మేకప్‌ ఆర్టిస్ట్‌: ప్రీతిశీల్ సింగ్ డిసౌజా (గంగూబాయి కతియావాడి)
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్: ఆర్ఆర్ఆర్-శ్రీనివాస్ మోహన్
బెస్ట్‌ ఫీమేల్‌ ప్లేబ్యాక్‌ సింగర్‌: శ్రేయా ఘోషల్ (ఇరవిన్ నిహాల్ - తమిళ మూవీ)
బెస్ట్‌ మేల్‌ ప్లేబ్యాక్‌ సింగర్‌: కాలభైరవ (ఆర్ఆర్ఆర్ - కొమురం భీముడో)
ఉత్తమ లిరిక్స్‌: చంద్రబోస్-కొండపొలం మూవీ (తెలుగు)
ఉత్తమ యాక్షన్‌ డైరెక్షన్‌ అవార్డ్‌(స్టంట్‌ కొరియోగ్రఫీ): ఆర్ఆర్ఆర్- కింగ్ సోలమన్
ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌: వీరా కపూర్ ఏ (సర్దార్ ఉద్దామ్-హిందీ)
ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌: దిమిత్రీ మాలిక్ & మాన్సి ధ్రువ్ మెహతా (సర్దార్ ఉద్దామ్)
ఉత్తమ ఎడిటింగ్‌: సంజయ్ లీలా భన్సాలీ (గంగూబాయి కతియావాడి మూవీ)

బెస్ట్‌ ఆడియోగ్రఫీ (లొకేషన్‌ సౌండ్‌ రికార్డిస్ట్‌): అరుణ్ అశోక్ & సోనూ కేపీ (చవిట్టు మూవీ-మలయాళం)
బెస్ట్‌ ఆడియోగ్రఫీ (సౌండ్‌ డిజైనర్‌) : అనీష్ బసు (జీలీ మూవీ- బెంగాలీ)
బెస్ట్‌ ఆడియోగ్రఫీ (రీరికార్డిస్ట్‌ ఆఫ్‌ ద ఫైనల్‌ మిక్స్‌డ్‌ ట్రాక్‌): సినోయ్ జోసెఫ్ (సర్దార్ ఉద్దామ్-హిందీ)
బెస్ట్‌ స్క్రీన్‌ప్లే (ఒరిజినల్‌): షాహీ కబీర్ (నాయట్టు సినిమా-మలయాళం)
బెస్ట్‌ స్క్రీన్‌ప్లే (డైలాగ్‌ రైటర్‌) : ప్రకాశ్ కపాడియా & ఉత్కర్షిణి వశిష్ట (గంగూబాయి కతియావాడి)
బెస్ట్‌ సినిమాటోగ్రఫీ: అవిక్ ముఖోపాధ్యాయ్ (సర్దార్ ఉద్దామ్ మూవీ-హిందీ)
ఉత్తమ చైల్డ్‌ ఆర్టిస్ట్‌: భవిన్ రబరీ (ఛెల్లో షో - గుజరాతీ సినిమా)
బెస్ట్‌ ఫిలిం ఆన్‌ ఎన్వైర్‌మెంట్‌ కంజర్వేషన్‌: అవషావ్యూహం (మలయాళం)
బెస్ట్‌ ఫిలిం ఆన్‌ సోషల్‌ ఇష్యూస్‌: అనునాద్-ద రెజోనెన్స్ (అస్సామీస్) 
బెస్ట్‌ పాపులర్‌ ఫిలిం ఆన్‌ ప్రొవైడింగ్‌ హోల్‌సమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌:  ఆర్ఆర్ఆర్
ఇందిరాగాంధీ అవార్డ్‌ ఫర్‌ బెస్ట్‌ డెబ్యూ ఫిలిం ఆఫ్‌ ఎ డైరెక్టర్‌: మెప్పాడియన్ (మలయాళం)
స్పెషల్ జ్యూరీ అవార్డ్: షేర్ షా (హిందీ సినిమా)
నర్గీస్ దత్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఫిల్మ్ ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్: ద కశ్మీరీ ఫైల్స్ (హిందీ)

Gurram Jashuva Award: రేపాకకు గుర్రం జాషువా జాతీయ పురస్కారం

భాషల వారీగా ఉత్తమ చిత్రాలు

బెస్ట్ మీషింగ్ ఫిల్మ్: బూంబా రైడ్ 
బెస్ట్ అస్సామీస్ ఫిల్మ్: అనుర్ 
బెస్ట్ బెంగాలీ ఫిల్మ్: కల్కొకో-హౌస్ ఆఫ్ టైమ్
బెస్ట్ హిందీ ఫిల్మ్: సర్దార్ ఉద్దామ్
బెస్ట్ గుజరాతీ ఫిల్మ్: లాస్ట్ ఫిల్మ్ షో
బెస్ట్ కన్నడ ఫిల్మ్: చార్లి 777
బెస్ట్ మైథిలీ ఫిల్మ్: సమాంతర్
బెస్ట్ మరాఠీ ఫిల్మ్: ఏక్ దా కై ఝాలా
బెస్ట్ మలయాళ ఫిల్మ్: హోమ్
బెస్ట్ మెయిటెయిలోన్ ఫిల్మ్: ఏక్ హోయిగీ యమ్ (అవర్ హౌమ్)
బెస్ట్ ఒడియా ఫిల్మ్: ప్రతిక్ష‍్య (ద వెయిట్)
బెస్ట్ తమిళ్ ఫిల్మ్: కడైసి వివసై (ద లాస్ట్ ఫార్మర్)
బెస్ట్ తెలుగు ఫిల్మ్: ఉప్పెన

Norman Borlaug Award: స్వాతి నాయక్‌కు ప్రతిష్టాత్మక నార్మన్‌ బోర్లాగ్‌ అవార్డు

నాన్‌ ఫీచర్‌ ఫిలింస్‌

బెస్ట్ నాన్ ఫీచర్ ఫిల్మ్: ఏక్ థా గావ్ (గర్హివాలీ - హిందీ)
బెస్ట్‌ వాయిస్‌ ఓవర్‌: కులదా కుమార్ భట్టాచారి (హాథీ బందూ)
బెస్ట్‌ మ్యూజిక్‌ డైరెక్షన్‌: ఇషాన్ దీవేచా (సక్కలెంట్)
బెస్ట్‌ ఎడిటింగ్‌: అబ్రో బెనర్జీ (ఇఫ్ మెమొరీ సెర్వ్స్ మీ రైట్)
బెస్ట్‌ ఆన్‌లొకేషన్‌ సౌండ్‌ రికార్డిస్ట్‌: సురుచి శర్మ (మీన్ రాగా)
బెస్ట్‌ ఆడియోగ్రఫీ(ఫైనల్‌ మిక్స్‌డ్‌ ట్రాక్‌): ఉన్ని కృష్ణన్ (ఏక్ థా గావ్)
బెస్ట్‌ సినిమాటోగ్రఫీ: బిట్టూ రావత్ (పాతాళ్ తీ)

ఉత్తమ డైరెక్షన్‌: బకుల్ మతియానీ (స్మైల్ ప్లీజ్)
ఉత్తమ కుటుంబ కథా చిత్రం: చాంద్ సాన్సీ (హిందీ)
ఉత్తమ షార్ట్‌ ఫిక్షన్‌ ఫిలిం:  దాల్ బాత్ (గుజరాతీ)
స్పెషల్‌ జ్యూరీ అవార్డ్‌: రేఖా మూవీ (మరాఠీ)
బెస్ట్ ఏనిమేషన్ ఫిల్మ్: కండిట్టుండూ (మలయాళం)
బెస్ట్‌ ఇన్వెస్టిగేటివ్‌ ఫిలిం: లుకింగ్ ఫర్ చలాన్ (ఇంగ్లీష్)
బెస్ట్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ ఫిలిం: ఆయుష్మాన్ (ఇంగ్లీష్-కన్నడ)
బెస్ట్‌ ఎడ్యుకేషనల్‌ ఫిలిం: సిర్పంగిలన్ సిర్పంగల్ (తమిళం)
బెస్ట్‌ ఫిలిం ఆన్‌ సోషల్‌ ఇష్యూస్‌(షేర్‌డ్): మీతూ దీ (ఇంగ్లీష్) & త్రీ టూ వన్ (మరాఠీ-హిందీ)

బెస్ట్‌ ఎన్వైర్‌మెంట్‌ ఫిలిం: మున్నం వలవు (మలయాళం)
బెస్ట్‌ ప్రమోషనల్‌ ఫిలిం: వర్లీ ఆర్ట్ (ఇంగ్లీష్)
బెస్ట్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఫిలిం: ఇథోస్ ఆఫ్ డార్క్‌నెస్ (హిందీ-బెంగాలీ)
బెస్ట్‌ ఆర్ట్స్‌ అండ్‌ కల్చర్‌ ఫిలింస్‌: టీఎన్ కృష్ణన్ బౌ స్ట్రింగ్స్ టూ డివైన్
బెస్ట్‌ బయోగ్రాఫికల్‌ ఫిలిం(షేర్‌డ్): రుఖు మతిర్ దుఖు మహీ (బెంగాలీ) & బియాండ్ బ్లాస్ట్ (మణిపురి)
బెస్ట్‌ ఎత్నోగ్రాఫిక్‌ ఫిలిం: ఫైర్ ఆన్ ఎడ్జ్ (టివా)
బెస్ట్‌ డెబ్యూ నాన్‌ ఫియేచర్‌ ఫిలిం ఆఫ్‌ ఎ డైరెక్టర్‌:  పాంచిక (గుజరాతీ- డైరెక్టర్ అంకిత్ కొఠారీ)

SIIMA Awards 2023: సైమా ఉత్తమ నటుడుగా జూనియర్ ఎన్టీఆర్

#Tags