CPGET Notification 2024: సీపీగెట్ 2024 నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. ప్ర‌వేశానికి యూనివ‌ర్సిటీలు ఇవే..!

తెలంగాణ రాష్ట్రంలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌(పీజీ) కోర్సుల్లో ప్రవేశాలు కోరుకునే వారి కోసం కామన్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (సీపీగేట్‌)–2024 ప్రకటన వెలువడింది.

సాక్షి ఎడ్యుకేష‌న్‌: పీజీలో ప్ర‌వేశానికి నిర్వ‌హించే ఈ ప‌రీక్ష‌ను ఆన్‌లైన్‌ విధానంలో నిర్వ‌హిస్తారు. దీని ద్వారా తెలంగాణలోని ఎనిమిది విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ కళాశాలల్లో పీజీ, పీజీ డిప్లొమా, ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

యూనివర్సిటీలు ఇవే
ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, శాతవాహన, జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నాలజికల్‌ యూనివర్సిటీలు, తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయాలు.

Army Chief: ఆర్మీ చీఫ్‌ మనోజ్‌ పాండే పదవీకాలం పొడిగింపు

ప్రవేశాలు కల్పించే కోర్సులు
»    పీజీ కోర్సులు: ఎంఏ, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంహెచ్‌ఆర్‌ఎం, ఎంటీఎం, ఎంకాం, ఎంఈడీ, ఎంపీఈడీ, ఎంఎస్సీ, ఎంబీఏ, ఎంఎల్‌ఐబీఎస్సీ, బీఎల్‌ఐబీఎస్సీ.
»    అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సులు: బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ/ఫార్మాస్యూటికల్‌ కెమిస్ట్రీ, ఎకనామిక్స్, ఎంబీఏ.
»    పీజీ డిప్లొమా కోర్సులు: చైల్డ్‌ సైకాలజీ, ఫ్యామిలీ మ్యారేజ్‌ కౌన్సిలింగ్, ఫోరెన్సిక్‌ సైన్స్, ఫార్మాస్యూటికల్‌ సైన్సెస్‌.
»    అర్హతలు: పీజీ కోర్సులో ప్రవేశాలు పొందాలనుకునే వారు సంబంధిత డిగ్రీలో కనీసం 40 శాతం మార్కులు, బీఎడ్‌/బీపీఎడ్‌ కోర్సులకు డిగ్రీలో 55 శాతం మార్కులు, ఇంటిగ్రేటెడ్‌ కోర్సులకు 10+2/ఇంటర్మీడియట్‌లో 50 శాతం మార్కులు తప్పనిసరి.

Landslide: తీవ్ర విషాదం.. కొండచరియల కారణంగా 2,000 మంది మృతి!!

»     పరీక్ష విధానం: ఈ పరీక్షను ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తారు. మొత్తం వంద ప్రశ్నలు–వంద మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్షకు కేటాయించిన సమయం 90 నిమిషాలు. ప్రతి సబ్జెక్టుకూ సిలబస్‌ను నిర్దేశించారు. కోర్సులను అనుసరించి ప్రశ్నపత్రంలో మార్పు ఉంటుంది.
»     సీట్ల కేటాయింపు: విద్యార్థికి సీటు కేటాయింపు అనేది ఎంపిక చేసుకున్న సబ్జెక్టు, ఆ సబ్జెక్ట్‌లో పరీక్ష రాసిన వారి సంఖ్య, అభ్యర్థికి వచ్చిన ర్యాంకు, కేటగిరి, ఉన్న సీట్ల సంఖ్య తదితర అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఎక్కువ మంది విద్యార్థులు యూనివర్సిటీ క్యాంపస్‌లో చదవాలని కోరుకుంటారు. కానీ సీట్ల సంఖ్య పరిమితం. పోటీ ఎక్కువగా ఉంటుంది. అర్హత పరీక్షలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు క్యాంపస్‌ సీట్లు పొందడానికి అవకాశం ఉంటుంది.

TS 10th Class Supplementary Hall Ticket 2024 Download : టెన్త్ సప్లిమెంటరీ హాల్‌టికెట్లు విడుద‌ల‌.. హాల్‌టికెట్లల‌ను డౌన్‌లోడ్ చేసుకోండిలా.. పరీక్షల షెడ్యూల్ ఇదే..

ముఖ్యసమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చే సుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 17.06.2024
»    రూ.500 ఆలస్య రుసుముతో: 2024 జూన్‌18–25 తేదీ వరకు;
»    రూ.2 వేలు లేట్‌ ఫీజుతో: 2024 జూన్‌ 26–30 తేదీ వరకు;
»    ఆన్‌లైన్‌ పరీక్షలు ప్రారంభ తేదీ: 05.07.2024
»    వెబ్‌సైట్‌: https://cpget.tsche.ac.in

JEE Advanced Results 2024 : జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫ‌లితాలు విడుద‌ల తేదీ ఇదే..! 'కీ' కూడా...

#Tags