CTET July 2024 Notification: కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (సీటెట్‌ జూలై–2024)కు నోటిఫికేషన్‌ విడుదల..

సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌(సీబీఎస్‌ఈ).. కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (సీటెట్‌ జూలై–2024æ)కు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న 136 నగరాల్లో సీటెట్‌ పరీక్షను 20 భాషల్లో నిర్వహిస్తారు. ఈ పరీక్షను ప్రతీ సంవత్సరం రెండుసార్లు(జూలై, డిసెంబర్‌) నిర్వహిస్తారు. సీటెట్‌లో సాధించిన స్కోరుకు జీవితకాల వ్యాలిడిటీ ఉంటుంది.

అర్హత: పన్నెండో తరగతి, డిగ్రీ, డీఈఎల్‌ఈడీ/డీఈడీ(ప్రత్యేక విద్య), బీఈడీ, బీఈడీ(ప్రత్యేక విద్య), బీఈఎల్‌ఈడీ/బీఎస్సీఈడీ/బీఏఈడీ/బీఎస్సీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి.

పరీక్ష విధానం: మొత్తం రెండు పేపర్లు, పేపర్‌–1, పేపర్‌–2 ఉంటాయి. 
పేపర్‌–1, 150 మార్కులకు, పేపర్‌–2, 150 మార్కులకు ప్రశ్నాపత్రం ఉంటుంది. పరీక్ష సమయం 2.30 గంటలు. ప్రశ్నలు మల్టిపుల్‌ ఛాయిస్‌ విధానంలో అడుగుతారు. –పేపర్‌–1 పరీక్ష ఒకటి నుంచి ఐదో తరగతులు బోధించే ఉపాధ్యాయులకు, పేపర్‌–2 ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతులు బోధించే ఉపాధ్యాయులకు నిర్వహిస్తారు.  

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఫీజు చెల్లింపు, ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 02.04.2024.
పరీక్ష తేది: 07.07.2024(పేపర్‌–1, పేపర్‌–2).

వెబ్‌సైట్‌: https://ctet.nic.in/

చదవండి: Telangana TRT & DSC 2024 Notification: 11,062 పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

#Tags