World Highest Paid Salary Job : రోజుకు జీతం రూ.48 కోట్లు.. ఏడాదికి రూ.17000 కోట్లు ప్యాకేజీ.. ఇతను ఎవరంటే...?
ప్రపంచంలో అత్యధిక వేతనం పొందుతున్న సీఈఓల గురించి చర్చించినప్పుడల్లా.. గూగుల్ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సత్య నాదెళ్ల, అడోబ్ శంతను నారాయణ్ తదితరుల పేర్లు తెరపైకి వస్తాయి. కానీ.. మీడియా నివేదికల ప్రకారం.. జగ్దీప్ సింగ్ క్వాంటమ్‌స్కేప్ అనే ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్ (EV) బ్యాటరీ కంపెనీ వ్యవస్థాపకుడు. భారత సంతతికి చెందిన జగ్దీప్ సింగ్ ఏడాదికి రూ.17,500 కోట్ల జీతం అందుకున్నారు. అంటే రోజుకు దాదాపు రూ.48 కోట్ల జీతం తీసుకుంటున్నాడు. చాలా కంపెనీలు తమ వార్షిక వేతనానికి సమానమైన ఆదాయాన్ని కూడా పొందడం లేదు. ఈ జీతం కారణంగా జగ్దీప్ సింగ్ వెలుగులోకి వచ్చాడు.
10 సంవత్సరాలు వివిధ కంపెనీలలో..
జగ్దీప్ సింగ్ స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి బీటెక్ (BTech) బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ (MBA) చదివారు. క్వాంటమ్‌స్కేప్‌ను స్థాపించడానికి ముందు, జగదీప్ సింగ్ 10 సంవత్సరాలు వివిధ కంపెనీలలో పనిచేశాడు. ఇది బ్యాటరీ సాంకేతికతలో విప్లవాత్మక పురోగమనాలకు అవకాశాన్ని చూసేలా చేసింది. జగదీప్ సింగ్ 2010లో కంపెనీని స్థాపించారు. అతని కంపెనీ Quantum Scape కొత్త సాలిడ్ స్టేట్ రీఛార్జ్ చేయగల లిథియం మెటల్ బ్యాటరీలను ఉత్పత్తి చేస్తుంది. ఈ బ్యాటరీలను ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉపయోగిస్తారు. ఫోక్స్ వ్యాగన్, బిల్ గేట్స్ వంటి దిగ్గజాలు కూడా ఆయన కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. ఇతని కంపెనీ ప్రధాన కార్యాలయం కాలిఫోర్నియాలో ఉంది.
ఇంత జీతం ఎందుకంటే...?
Quantum Scape 2020 నుంచి US స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో జాబితా చేయబడింది. తన కంపెనీకి ఇన్వెస్టర్ల నుంచి మంచి మద్దతు లభించింది. జగ్దీప్ సింగ్ జీతం ప్యాకేజీలో $2.3 బిలియన్ల విలువైన షేర్లు కూడా ఉన్నాయి. దీంతో ఆయన వార్షిక వేతనం దాదాపు రూ.17,500 కోట్లుగా మారింది.