Telangana Teachers: ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు ఆన్‌లైన్‌లోనే..

మంచిర్యాలఅర్బన్‌: ఉపాధ్యాయుల బదిలీలు, ప దోన్నతుల ప్రక్రియంతా ఆన్‌లైన్‌లో సాగుతుండగా.. ఒకట్రెండు వచ్చే గ్రీవెన్స్‌(అభ్యంతరాల పరి శీలన)కు 24 మంది ఉపాధ్యాయులు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో వెరిఫికేషన్‌(డిప్యూటేషన్‌) పే రిట రోజుల తరబడి కాలక్షేపం చేస్తున్నారు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల దరఖాస్తుల స్వీ కరణ ఆన్‌లైన్‌లో సెప్టెంబర్ 3 నుంచి 5వరకు పూర్తయింది. 6, 7, 8వ తేదీల్లో ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రతులను డీఈవో కార్యాలయంలో సమర్పించారు. సెప్టెంబర్ 6 నుంచి సర్టిఫికెట్ల పరిశీలనకు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు డిప్యూటేషన్‌(వెరిఫికేష న్‌ టీం) ఇస్తూ డీఈవో ప్రోసిడింగ్‌ ఇచ్చారు. ఎనిమి ది మంది ప్రధానోపాధ్యాయులు, వీరికి సహాయకులుగా 12మంది ఉపాధ్యాయులు బదిలీలు, పదోన్నతులు పూర్తయ్యే వరకు డీఈవో కార్యాలయంలో అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. 6నుంచి 8వరకు సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ ముగిసిపోవడం, మిగిలిన అభ్యంతరాల నుంచి సీనియార్టీ జాబితా ప్రదర్శనకు వరకు అంతా ఆన్‌లైన్‌లో కొనసాగుతుంది. ఒకటి రెండు గ్రీవెన్స్‌కు వస్తే నలుగురు ఉంటే సరిపోతుంది. కానీ పని లేకున్నా అందరూ అక్కడే ఉంటూ బడికి డుమ్మా కొడుతున్నారనే ఆరోపణలు లేకపోలేదు.

చదవండి: TSPSC Group 1 Prelims 2023 Cancelled : బిగ్ బ్రేకింగ్ న్యూస్‌..: గ్రూప్‌-1 ప్రిలిమ్స్ ర‌ద్దు.. కార‌ణం ఇదే..

బోధనపై ప్రభావం
బదిలీలు, పదోన్నతుల నేపథ్యంలో బడిబయట టీచర్లతో బోధనపై ప్రభావం పడుతోంది. ఎక్కడికి బదిలీ వస్తుంది..? పదోన్నతుల జాబితాలో పేరు ఎక్కడుంది..? ఇలా రకరకాల చర్చల్లో మునిగి తే లుతున్నారు. కాగా, 24మందిని డిప్యూటేషన్‌ కేటా యించడంపై పెదవి విరుస్తున్నారు. వీరిలో పాఠశాలలను చక్కదిద్దాల్సిన హెచ్‌ఎంలు ఉండడం గమన్హారం. ఉపాధ్యాయులను రిలీజ్‌ చేయకపోవడం వల్ల బడికి డుమ్మా కొడుతున్నారు.

సర్వే.. పరీక్షలు
నవంబర్‌ 3 నుంచి స్టేట్‌ ఎడ్యుకేషనల్‌ అచీవ్‌మెంట్‌ సర్వే జరుగనుంది. సెప్టెంబర్ 23 నుంచి ప్రాక్టీస్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 30లోపు ఎఫ్‌ఏ–2 పరీక్షలు పూర్తి చేయాల్సి ఉంది. అక్టోబర్‌ 6నుంచి ప్రారంభమయ్యే ఎస్‌ఏ–1 పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయాల్సి ఉంది. శనివారం ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమావేశం యధావిధిగా కొనసాగించాలని డీఈవో ఆదేశించారు. అయినా కొందరు హెచ్‌ఎంలు, టీచర్లు డీఈవో ఆఫీస్‌ వెరిఫికేషన్‌ టీం(డ్యూటీ పేరిట) తప్పించకుంటున్నారు.

సర్టిఫికెట్ల పరిశీలనకు నియమించాం
ఆరు టీముల్లో ఆరుగురు ఉపాధ్యాయులున్నారు. మిగతా వాళ్లందరూ పాఠశాలకు వెళ్తున్నారు. బదిలీ, పదోన్నతుల నేపథ్యంలో అవసరం మేరకు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు విధులు కేటాయించాం. సర్టిఫికెట్ల పరిశీలన, సర్వీసు వెరిఫికేషన్‌, గ్రీవెన్స్‌ పరిశీలన చేశారు. ప్రస్తుతం పని తగ్గడంతో ఒక్కో టీంలో ఒక్కరే ఉన్నారు. ఏ రోజుకు ఆరోజు గ్రీవెన్స్‌ వస్తే డిస్పోజ్‌ చేస్తున్నారు.
– యాదయ్య, డీఈవో

#Tags