Pranjali Awasthi: 16 ఏళ్లకే రూ.100 కంపెనీ స్థాపించిన అమ్మాయి.. ఏడేళ్ల వయసులోనే కోడింగ్!!

16 ఏళ్ల ప్రాంజలి అవస్థి ఒక చిన్నపిల్ల కాదు.. టెక్ పరిశ్రమలో ఒక ఘనత సాధించిన యువ పారిశ్రామిక వేత్త.

ఆమె స్థాపించిన డెల్వ్.ఏఐ (Delv.AI) అనే స్టార్టప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతోంది.

రూ.100 కోట్ల విలువతో.. ఈ యువతి సక్సెస్ రూల్స్‌ను తిరగరాసింది. డెల్వ్.ఏఐ పరిశోధన కోసం డేటా వెలికితీతకు సంబంధించిన సేవలను అందిస్తుంది. ప్రస్తుతం ఈ సంస్థలో పది మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు.

ప్రాంజలి 2022లో డెల్వ్.ఏఐని ప్రారంభించింది. ఈ స్టార్టప్ ఇప్పటికే రూ.100 కోట్ల (12 మిలియన్ల డాలర్లు) విలువను కలిగి ఉంది. డెల్వ్.ఏఐ యొక్క లింక్డ్‌ఇన్ ప్రొఫైల్ ప్రకారం.. ఈ సంస్థలో 10 మంది ప్రత్యేక నిపుణుల బృందం పనిచేస్తోంది.

ఈ ఘనతకు పునాది వేసింది ప్రాంజలి తండ్రి. పాఠశాలల్లో కంప్యూటర్ సైన్స్ విద్యను ప్రోత్సహించడం ద్వారా, ఆమె ఉన్నతికి దారితీశారు. ఈ ప్రోత్సాహంతో.. ఏడు సంవత్సరాల వయస్సులోనే ఆమె కోడింగ్ ప్రారంభించింది. ఆమె 11 ఏళ్ల వయస్సులో ఉన్న‌పుడు త‌న‌ కుటుంబం భారతదేశం నుంచి ఫ్లోరిడాకు మారింది.

Parvathy Gopakumar: సవాళ్లను అధిగమించి విజయం సాధించిన స్ఫూర్తిదాయక మహిళ ఈమె.. ఒంటి చేతితో..

13 ఏళ్ల వయస్సులో.. ఫ్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్శిటీకి చెందిన రీసెర్చ్ ల్యాబ్స్‌లో ఇంటర్న్‌షిప్ ద్వారా ప్రాంజలి వ్యాపార ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఈ ఇంటర్న్‌షిప్ సమయంలో కోవిడ్‌ మహమ్మారి కారణంగా వర్చువల్ హైస్కూల్‌లో చదువుతున్నప్పుడు, మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్‌లపై ఆమె దృష్టి పెట్టింది. ఓపెన్ చాట్‌జీపీటీ-3(ChatGPT-3) బీటా విడుదలైన క్రమంలోనే ఈ వెంచర్‌ కూడా మొదలైంది.

హైస్కూల్ విద్యార్థిని లూసీ గువో, బ్యాకెండ్ క్యాపిటల్‌కు చెందిన డేవ్ ఫాంటెనోట్ నాయకత్వంలో మియామిలో AI స్టార్టప్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్‌లో పాల్గొన్నారు. ఈ ప్రోగ్రామ్ ద్వారా ఆన్ డెక్, విలేజ్ గ్లోబల్ నుంచి పెట్టుబడులను పొందడంలో ప్రాంజలికి సహాయమైంది.

2022 జనవరిలో ప్రాంజలి తన కంపెనీని స్థాపించి దాదాపు రూ.3.7 కోట్లతో ప్రారంభ నిధులను సేకరించింది. కేవలం ఒక ఏడాదిలోనే డెల్వ్.ఏఐ విలువ రూ.100 కోట్లకు చేరుకుంది.

Payal Dhare: ఆశ్చర్యం.. పల్లెటూరి అమ్మాయికి సంవత్సరానికి 5 కోట్లు ఆదాయం!!

#Tags