Universal Public Exam: సార్వ‌త్రిక ప‌రీక్ష‌ల కోసం ఫీజు..

సార్వ‌త్రిక విద్యాపీఠం ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల కోసం డీఈవో సంస్థ ప‌రీక్ష ఫీజు చెల్లించాల్సిన తేదీని ప్ర‌క‌టించింది. ఇవి వ‌చ్చే ఏడాది జ‌రిగే ప‌రీక్ష‌లు. ఈ ప‌రీక్ష‌ల‌కు హాజ‌రు అయ్యే వారంతా కింద ఇచ్చిన వివ‌రాల‌ను ప‌రిశీలించి, త‌గిన ఫీజును చ‌ల్లించాల్సి ఉంటుంది.
Last date for universal public exam fees payment

సాక్షి ఎడ్యుకేష‌న్: వచ్చే ఏడాది(2024)లో జరిగే సార్వత్రిక విద్యాపీఠం టెన్త్‌, ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలకు హాజరుకాగోరు విద్యార్థులు పరీక్ష ఫీజును ఈ ఏడాది అక్టోబర్‌ 15 లోపు చెల్లించాలని డీఈవో ఎం.వెంకటలక్ష్మమ్మ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

School Fees: పాఠ‌శాల‌ల్లో ఫీజుల వివ‌రాలు విద్యాశాఖ‌కు చేరాల్సిందే

పదో తరగతి విద్యార్థులు ఒక్కో సబ్జెక్టుకు రూ.100, ఇంటర్‌ విద్యార్థులు ఒక్కో సబ్జెక్టుకు రూ.150, ప్రాక్టికల్స్‌కు ఒక్కో సబ్జెక్టుకు రూ.100 చొప్పున చెల్లించాలన్నారు. మరిన్ని వివరాలకు www. apopenschool.ap.gov.in వెబ్‌సైట్‌లో సంప్రదించాల్సిందిగా కోరారు.

#Tags