Engineering Counselling 2024 :నేడే ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు వెబ్ ఆప్షన్ల మార్పిడికి అవకాశం
మురళీనగర్: ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించి వెబ్ ఆప్షన్ల గడువు శుక్రవారంతో ముగిసింది. దీంతో కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్‌లోని హెల్ప్‌లైన్ కేంద్రానికి అత్యధిక సంఖ్యలో విద్యార్థులు వచ్చి వెబ్ ఆప్షన్లు పెట్టుకున్నారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కూడా నిర్వహించి వీరికి వెబ్ ఆప్షన్లు పెట్టుకోవడానికి సిబ్బంది సహకరించారు. వీరు తమ ఆప్షన్లను ఫ్రీజ్ చేశారు. శనివారం ఆప్షన్లు మార్చుకోవడానికి అవకాశం ఉందని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.నారాయణరావు సూచించారు. ఈనెల 16న సీట్లు కేటాయిస్తారు. 17 నుంచి 22 తేదీ వరకు సెల్ఫ్ జాయినింగ్ రిపోర్టు ఆన్‌లైన్‌లో చేసి కాలేజీలకు ఆ రిపోర్టు సమర్పించాలని ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా పాలిసెట్ ఆఖరి దశ కౌన్సెలింగ్ శుక్రవారం కొనసాగింది. విద్యార్థుల సర్టిఫికెట్లను అధికారులు పరిశీలించారు. పలువురు విద్యార్థులు పాలిటెక్నిక్ ప్రవేశాలకు సంబంధించి ఆప్షన్లు పెట్టుకున్నారు. శనివారంతో పాలిటెక్ వెబ్ ఆప్షన్ల గడువు ముగుస్తుంది.
Also Read: ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డులకు దరఖాస్తుల స్వీకరణ