College Fest: ఈ విషయాల్లో విద్యార్థులు అవగాహన పెంచుకోవాలి..

మహిళా డిగ్రీ కళాశాలలో బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆక్షి 2024 పేరిట ఫెస్ట్‌లో పాల్గొన్న ప్రొఫెసర్‌ వెంకటరమణ విద్యార్థులను పలు విషయాల్లో అవగాహన పెంచుకోవాలని వివరించారు. అలాగే, విద్యార్థులను అన్ని రంగాల్లో ముందుండాలని ప్రోత్సాహిస్తూ మాట్లాడారు..

శ్రీకాకుళం: ప్రస్తుత పోటీ ప్రపంచానికి తగినట్టుగా విద్యార్థులు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, రోబోటెక్స్‌తోపాటు డేటాసైన్స్‌పై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాలని జీఎంఆర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ కంప్యూటర్స్‌ విభాగాధిపతి ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఎ.వెంకటరమణ పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నగరంలోని ఎల్‌ఐసీ కార్యాలయం సమీపంలో ఉన్న కాకినాడ ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలలో బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌ విభాగం ఆధ్వర్యంలో గురువారం ‘ఆక్షి 2024’ పేరిట కంప్యూటర్‌ ఇంటర్నల్‌ ఫెస్ట్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు.

Hall Ticket Download: ఆదర్శ పాఠశాలలో ప్రవేశ పరీక్షకు హాల్‌టికెట్‌..

ప్రొఫెసర్‌ వెంకటరమణ మాట్లాడుతు కంప్యూటర్‌ సైన్స్‌ అతివేగంగా అభివృద్ధి చెందుతున్న రంగమని, ప్రతి రోజు సరికొత్త ఆవిష్కరణలు జరుగుతున్నాయని విద్యార్థులకు గుర్తుచేశారు. ఫెస్ట్‌లో భాగంగా వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కళాశాల ప్రిన్సిపాల్‌ కె.శివంకర్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డైరెక్టర్‌ బీఎస్‌ చక్రవర్తి, కంప్యూటర్స్‌ హెచ్‌ఓడీ ఎల్‌.ప్రసాదరావు, ఇ.రామ్‌కుమార్‌, ఎస్‌.హరిమానస, లలితరెడ్డి, ఎస్‌.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

JEE Advanced 2024: జేఈఈ అడ్వాన్స్‌డ్‌–2024 రిజిస్ట్రేషన్‌ తేదీల మార్పు

#Tags