RIMS Srikakulam : శ్రీకాకుళం రిమ్స్‌ కళాశాలలో ‘సీటు’ పాట్లు

RIMS Srikakulam : శ్రీకాకుళం రిమ్స్‌ కళాశాలలో ‘సీటు’ పాట్లు

శ్రీకాకుళం: శ్రీకాకుళం రిమ్స్‌ కళాశాలలో కొందరు వైద్యుల నిర్వాకం వల్ల పేద విద్యార్థులు నష్టపోతున్న దుస్థితి ఏర్పడింది. వైద్యుల హాజరు ఈ వైద్య కళాశాలకు మంజూరు కావాల్సిన అదనపు సీట్లకు ఎసరు పెట్టింది.రిమ్స్‌ ఆస్పత్రి, వైద్య కళాశాలలో గత ప్రభుత్వం అనేక సౌకర్యాలను కల్పించటంతో 57కు పైగా పీజీ సీట్లు మంజూరయ్యాయి. అలాగే 50 వరకు ఎంబీబీఎస్‌ సీట్లు మంజూరయ్యాయి. దీంతో గత విద్యా సంవత్సరం నాటికి ఎంబీబీఎస్‌ సీట్ల సంఖ్య 150 చేరింది. మరో 50 సీట్లు పెరిగేందుకు కూడా తగిన సౌకర్యాలు ఉండటంతో అందుకోసం ప్రభుత్వ సూ చనలు మేరకు రిమ్స్‌ యాజమాన్యం ఎంసీఐకి దర ఖాస్తు చేసింది. కొద్ది నెలల కిందట పరిశీలనకు వ చ్చిన ఎంసీఐ బృందం రిమ్స్‌లో కొందరు వైద్యులు విధులకు సక్రమంగా హాజరు కాకపోవటం, తరచూ సెలవులు పెట్టడంతో ఓపీ, శస్త్రచికిత్సలు, ఇన్‌ పేషెంట్ల సంఖ్య తక్కువగా ఉండడం గమనించింది.

Also Read: GATE 2025 Exam Dates Announced

ఇదే విషయాన్ని తెలుపుతూ అన్ని సౌకర్యా లు అదనపు సీట్ల కేటాయింపునకు అనువుగా ఉన్నప్పటికీ వైద్యుల హాజరు, ఓపీ తక్కువగా ఉండటంతో అదనపు సీట్లు మంజూరు చేయలేమని తేల్చి చెబుతూ రిమ్స్‌ యాజమాన్యానికి ఎంసీఐ లేఖ పంపించింది. దీంతో రిమ్స్‌ అధికారులు ఓపీ, ఇన్‌ పేషెంట్లు, శస్త్రచికిత్సల సంఖ్యను పెంచేందుకు దృష్టి సారించారు. న్యూరాలజీ, కార్డియాలజీ, యూరాలజీ, ఆంకాలజీ వంటి నిపుణులు సైతం రిమ్స్‌లో ఉండటంతో వీరి సేవలను మరింతగా ఉపయోగించుకోవటం ద్వారా రోగుల సంఖ్యను పెంచాలని, వైద్యు లు సెలవులు పెట్టకుండా ఉండేలా నిబంధనలు తయారు చేసుకున్నారు. పనిచేసేందుకు ఇష్టం లేనివారు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోవాలని సూచనలు చేస్తున్నారు. మరోసారి పరిశీలనకు రావాలని ఎంసీఐకి ఉన్నతాకారుల ద్వారా రిమ్స్‌ అధికారులు లేఖను పంపించేందుకు సిద్ధం చేస్తున్నారు. వైద్యులు సక్రమంగా హాజరైతే అదనంగా 50 ఎంబీబీఎస్‌ సీట్లు మంజూరయ్యేందుకు అవకాశం ఉంది. మరో 50 మంది పేద విద్యార్థులకు వైద్య విద్య అందుబాటులోకి వస్తుంది.

#Tags