PG Semester Exams: ఈనెల 28 నుంచి పీజీ రెండు, నాలుగు సెమిస్ట‌ర్ ప‌రీక్ష‌లు..

వైవీయూ: యోగివేమన విశ్వవిద్యాలయం ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ, ఎంపీఈడీ పోస్టు గ్రాడ్యుయేషన్‌ 2, 4వ సెమిస్టర్ల పరీక్షలు ఈనెల 28 నుంచి నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎన్‌. ఈశ్వరరెడ్డి తెలిపారు. 2వ సెమిస్టర్‌ పరీక్షలు ఈనెల 28న, జూలై 1, 3,4,8,10 తేదీలలో ఉంటాయన్నారు. 4వ సెమిస్టర్‌ పరీక్షలు ఈ నెల 29, జూలై 2,4,6,9,11 తేదీలలో నిర్వహించనున్నట్లు తెలిపారు. పైన తెలిపిన తేదీలలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు సంబంధిత శాఖలో హాల్‌టికెట్లు పొంది పరీక్షలకు హాజరుకావాలని సూచించారు.

 Openschool Results:ఓపెన్‌ ఇంటర్‌, ఎస్సెస్సీ ఫలితాలు విడుదల

#Tags