NAAC A Grade : ఈ డిగ్రీ క‌ళాశాల‌కు న్యాక్ ఏ గ్రేడ్‌..

పట్టణంలోని ఎన్‌ఎస్‌పీఆర్‌ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు నేషనల్‌ అసెస్మెంట్‌ అక్రిడిటేషన్‌లో ఏ గ్రేడ్‌ గుర్తింపు లభించినట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎం.ప్రగతి తెలిపారు.

హిందూపురం: పట్టణంలోని ఎన్‌ఎస్‌పీఆర్‌ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు నేషనల్‌ అసెస్మెంట్‌ అక్రిడిటేషన్‌లో ఏ గ్రేడ్‌ గుర్తింపు లభించినట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎం.ప్రగతి తెలిపారు. శనివారం కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, కళాశాలలో సౌకర్యాలు, బోధన తదితర అంశాలపై ఈ ఏడాది జూలైలో 10, 11 తేదీల్లో న్యాక్‌ బృందం, ఈనెల 5, 6 తేదీల్లో ముగ్గురు సభ్యులతో కూడిన మరో బృందం కళాశాలను సందర్శించి పరిశీలించిందన్నారు.

AP Schools : తాజాగా ఈ పరీక్షలు రద్దు చేస్తూ కీల‌క‌ నిర్ణయం..

కళాశాల నిర్వహణ, బోధన, సౌకర్యాలు తదితర అంశాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేస్తూ కళాశాలకు న్యాక్‌–ఏ గ్రేడ్‌ గుర్తింపు ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ మేరకు న్యాక్‌ కార్యాలయం నుంచి కళాశాలకు మెయిల్‌ ద్వారా సమాచారం అందిందిందన్నారు. ఇందుకు సహకరించిన అధ్యాపక, అధ్యాపకేతర బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ వెంకటేశులు, ఐక్యూఏసీ సమన్వయకర్త డాక్టర్‌ శ్రీలక్ష్మి, నరసింహులు పాల్గొన్నారు.

#Tags