Degree Admissions 2024 : డిగ్రీ క‌ళాశాలలో ప్ర‌వేశానికి నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. ఇక‌పై నాలుగేళ్ల కోర్సు!

ఆంధ్ర ప్ర‌దేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం 2024–25 విద్యా సంవత్సరానికి డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది..

హిందూపురం టౌన్‌: ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం 2024–25 విద్యా సంవత్సరానికి డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. గతేడాది మాదిరిగానే ఈ సారి కూడా ఆన్‌లైన్‌ విధానంలో డిగ్రీ అడ్మిషన్లు నిర్వహించనున్నారు. ఇంటర్‌ ఉత్తీర్ణులైన విద్యార్థుల నుంచి డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.

షెడ్యూల్‌ ఇలా..

ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా, విద్యార్థులు దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఈ నెల 10వ తేదీ వరకూ విద్యార్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. ఇందులో భాగంగా ఈ నెల 4వ తేది నుంచి 6వ తేదీ వరకూ స్పెషల్‌ కేటగిరి వెరిఫికేషన్‌ నిర్వహించారు. ఫిజికల్లీ చాలెంజ్‌డ్‌ / సీఏసీ / ఎక్స్‌ట్రా కరిక్యూలర్‌ యాక్టివిటీస్‌ /ఎన్‌సీసీ / గేమ్స్‌ అండ్‌ స్పోర్ట్స్‌ వంటి స్పెషల్‌ కేటగిరి వెరిఫికేషన్లు ఆయా యూనివర్సిటీల్లో ప్రాంతాల వారీగా నిర్వహిస్తారు. 5న ఓపెనింగ్‌ ఆఫ్‌ హెచ్‌ఎల్‌సీ ఫర్‌ వెరిఫికేషన్‌ ఆఫ్‌ సర్టిఫికెట్లు నిర్వహించారు. కోర్సులను ఎంపిక చేసుకోవడం కోసం ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకూ వెబ్‌ ఆప్షన్లకు అవకాశం ఇవ్వనున్నారు. ఈ నెల 19న సీట్లు కేటాయిస్తారు. అలాట్‌ అయిన విద్యార్థులు ఎంపికై న కళాశాలల్లో ఈ నెల 20 నుంచి 22వ తేదీలోగా రిపోర్ట్‌ చేయాలి. ఈ నెల 22 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.

Vacancies In Andhra Pradesh: ఏపీలో 400కు పైగా ఉద్యోగాలు.. డైరెక్ట్‌ ఇంటర్వ్యూతో కొలువులు

చదువు మధ్యలో మానేసినా..

విద్యార్థులు డిగ్రీ ఫస్టియర్‌ చదివి మానేసినప్పటికీ సర్టిఫికెట్‌ కోర్సు పేరుతో సర్టిఫికెట్‌ అందజేస్తారు. రెండేళ్లు అయితే డిప్లొమా సర్టిఫికెట్‌, మూడేళ్లు అయితే డిగ్రీ సర్టిఫికెట్‌, నాలుగేళ్లు చదివితే డిగ్రీ ఆనర్స్‌ సర్టిఫికెట్‌ను అందిస్తారు. విద్యార్థి డిగ్రీ నాలుగేళ్లలో ఎప్పుడైనా చదువు మధ్యలో మానేసినా దానికి అనుగుణంగానే సర్టిఫికెట్లు ప్రధానం చేస్తారు. ఫస్టియర్‌ నుంచి నాలుగేళ్ల లోపు ఏ దశలో చదువు మానేసినా, ఏడేళ్లలోపు తిరిగి ప్రవేశం పొంది విద్యాభ్యాసం కొనసాగించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. డిగ్రీ విద్యా విధానంలో ప్రవేశ పెట్టిన నూతన సింగిల్‌ మేజర్‌ అనర్స్‌ డిగ్రీ పద్ధతిపై ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. గత విద్యా సంవత్సరం నుంచే నూతన విద్యా విధానం అమలవుతోంది.

చిన్న బడిలో మందుబాబుల హల్‌చల్‌!

నాలుగేళ్ల డిగ్రీ ఆనర్స్‌ కోర్సులు

జాతీయ విద్యా విధానం 2020 నిబంధనలను అనుసరించి ఏపీ ఉన్నత విద్యా మండలి ఈ ఏడాది నుంచి నాలుగేళ్ల డిగ్రీ ఆనర్స్‌ కోర్సులు ప్రవేశ పెట్టింది. సంప్రదాయక మూడేళ్ల డిగ్రీ కోర్సుల స్థానంలో నాలుగేళ్ల డిగ్రీ ఆనర్స్‌ కోర్సులను అమలు చేస్తున్నారు. ఈ కోర్సుల్లో గతంలో మాదిరిగా మూడు మేజర్‌ సబ్జెక్టులు కాకుండా, ఒక్కటే మేజర్‌ సబ్జెక్టు ఉంటుంది. దీన్ని సింగిల్‌ మేజర్‌ డిగ్రీ కోర్సుగా పిలుస్తారు. ఉదాహరణకు గతంలో బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ మేజర్‌ సబ్జెక్టులుగా బీఎస్సీ చదువుకునే విద్యార్థి సింగిల్‌ మేజర్‌ సబ్జెక్టు విధానంలో బీఎస్సీ బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీల్లో ఏదో ఒక సబ్జెక్టును మేజర్‌ సబ్జెక్టుగా ఎంచుకుని, తనకు నచ్చిన వేరే సబ్జెక్టును మైనర్‌ సబ్జెక్టుగా ఎంచుకుని చదువుకుంటాడు. ఇంటర్‌లో ఆర్ట్స్‌, సైన్స్‌ సబ్జెక్టులతో సంబంధం లేకుండా ఏ సబ్జెక్టునైనా మైనర్‌ సబ్జెక్టుగా ఎంపిక చేసుకోవచ్చు.

Anganwadi Workers Retirement Benefits: అంగన్‌వాడీలకు రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ అందజేయాలి

సీట్ల కేటాయింపు ఇలా...

డిగ్రీ కోర్సుల్లో 50 శాతం రిజర్వేషన్లు తప్పనిసరి చేశారు. ఇంటర్‌లో కామర్స్‌ ఒక సబ్జెక్టుగా చదివిన వారికి బీకాం కోర్సులో 60 శాతం సీట్లు కేటాయిస్తారు. ఆర్ట్స్‌, హ్యుమానిటీస్‌లో ఇంటర్‌ పూర్తి చేసిన వారికి బీఏలో 50 శాతం సీట్లు కేటాయించారు. తక్కిన 50 శాతం ఇంటర్‌లో సైన్‌న్స్‌ గ్రూపు పూర్తి చేసిన వారికి కేటాయిస్తారు. ఎస్‌కే యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ కళాశాలల్లో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో ప్రవేశానికి విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. విద్యార్థులు www.aprche.gov.in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. అలాగే విద్యార్థులు దగ్గరలో ఉన్న డిగ్రీ కళాశాలకు వెళ్లి రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. సాధారణ కోర్సులకు రూ.3 వేల వరకూ, కంప్యూటర్‌ కోర్సులకు రూ.8 నుంచి రూ. 10 వేల వరకూ కోర్సును బట్టి ఫీజు ఉంటుంది.

UPSC Exam 2024 : ఆదివారం స‌జావుగా జ‌రిగిన యూపీఎస్సీ పరీక్ష‌.. ఈ విభాగాల్లో హాజ‌రైన‌వారి సంఖ్య‌!

#Tags