Medical College Admissions: మెడికల్‌ కళాశాలలో అడ్మిషన్లకు రంగం సిద్ధం

Latest Medical College Admissions

సాక్షి,పాడేరు: జిల్లాకు మంజూరైన ప్రభుత్వ వైద్య కళాశాల ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 2024–25 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు త్వరలో జరిగే కౌన్సెలింగ్‌ ద్వారా సీట్లు కేటాయించనున్నారు.

గిరిజనులకు ఉన్నత వైద్యం, వైద్యవిద్య లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో గత సీఎం వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పాడేరులో రూ.500కోట్లతో మెడికల్‌ కళాశాల నిర్మాణం చేపట్టారు. 35 ఎకరాల విస్తీర్ణంలో భవన నిర్మాణాలు చురుగ్గా జరుగుతున్నాయి.


Good news for Anganwadis: అంగన్‌వాడీల్లో భారీగా ఉద్యోగాలు

ఇవి పూర్తయ్యేందుకు సమయం పట్టే అవకాశం ఉన్నందున జిల్లా సర్వజన ఆస్పత్రికి అదనంగా రెండు అంతస్తుల భవనంతో పాటు బెడ్‌లు,ఆపరేషన్‌ థియేటర్‌, అన్ని సౌకర్యాలను సమకూర్చి బోధనాస్పత్రి నిర్వహించేందుకు వీలుగా తీర్చిదిద్దారు. ఈ ఏడాది నుంచి ఆడ్మిషన్లు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు. జాతీయ మెడికల్‌ కౌన్సిల్‌ పరిశీలన తరువాత ప్రవేశాలు కల్పించే అవకాశం ఉంది.

పూర్తిస్థాయి సౌకర్యాలు

సూపర్‌ స్పెషాలిటీ వైద్యం,వైద్యవిద్యకు సంబంధించి గత ప్రభుత్వం రూ.4కోట్ల వ్యయంతో కార్పొరేట్‌ స్థాయిలో జిల్లా సర్వజన ఆస్పత్రిలో సౌకర్యాలను కల్పించింది. అదనంగా రెండు అంతస్తుల భవనంతో పాటు 420 బెడ్‌లు, ఆపరేషన్‌ థియేటర్‌ సమకూర్చింది.

అన్ని వైద్య విభాగాలకు వేర్వేరుగా రోగుల గదులతో పాటు వైద్య పరికరాలు,ల్యాబ్‌లు ఏర్పాటు చేసింది. అసోసియేట్‌ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లు,అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు,వైద్య నిపుణులు,టెక్నికల్‌ సిబ్బంది ఏడు నెలల నుంచి విధుల్లో ఉన్నారు.గత ప్రభుత్వం మెడికల్‌ కళాశాలను ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించే లక్ష్యంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

వచ్చే వారం జాతీయ మెడికల్‌ కౌన్సిల్‌ పరిశీలన

జిల్లా ఆస్పత్రిలో అందుబాటులోకి వచ్చిన సూపర్‌ స్పెషాలిటీ సేవలు, 420బెడ్‌లు, ఫ్యాకల్టీ, ఇతర అన్ని సౌకర్యాలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు జాతీయ మెడికల్‌ కౌన్సిల్‌ వచ్చే వారం పాడేరులో పర్యటించనుంది. ఈమేరకు ఏర్పాట్లలో మెడికల్‌ కళాశాల,జిల్లా ఆస్పత్రి అధికారులు నిమగ్నమయ్యారు.

జాతీయ మెడికల్‌ కౌన్సిల్‌ అధికారులు పరిశీలన అనంతరం మెడికల్‌ కళాశాలలోని అడ్మిషన్లకు అనుమతులు జారీ చేసే అవకాశం ఉంది.

వచ్చేవారం జాతీయ మెడికల్‌ కౌన్సిల్‌ పర్యటన

వైద్య విద్య,ఉన్నత వైద్యానికి జిల్లా ఆస్పత్రిలో సౌకర్యాలు

కార్పొరేట్‌ స్థాయిలో

420 బెడ్‌లు ఏర్పాటు

అందుబాటులో ప్రొఫెసర్లు,

టెక్నికల్‌ సిబ్బంది

జిల్లా సర్వజన ఆస్పత్రిలో ప్రస్తుతం ఉన్న పోస్టుల వివరాలు

మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌–1

జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌–1

ప్రొఫెసర్లు–8 మంది

అసోసియేట్‌ ప్రొఫెసర్లు–17 మంది

అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు–31 మంది

టెక్నికల్‌,నర్సింగ్‌ సిబ్బంది 101 మంది

పరిశీలన పూర్తయితేఅనుమతులు

జాతీయ మెడికల్‌ కౌన్సిల్‌ పరిశీలన కోసం ఎదురుచూస్తున్నాం. జిల్లా సర్వజన ఆస్పత్రి కార్పొరేట్‌ స్థాయిలో అభివృద్ధి చెందింది. రోగులకు 420 బెడ్‌లతో పాటు అన్ని వసతులను అందుబాటులోకి తెచ్చాం.అన్ని విభాగాల వైద్య నిపుణులు ఇప్పటికే విధుల్లో నిమగ్నమయ్యారు.జాతీయ మెడికల్‌ కౌన్సిల్‌ ఇక్కడ సౌకర్యాల పరిశీలించిన అనంతరం మెడికల్‌ కళాశాల ప్రారంభానికిఅనుమతులువస్తాయని ఆశిస్తున్నాం. గిరిజనుల మెడికల్‌ కళాశాల కల సాకారమవుతుంది

#Tags