Results news: ఫలితాల విడుదల

Today Results news

వైవీయూ: యోగి వేమన విశ్వవిద్యాలయం పరిధిలోని ప్రొద్దుటూరు డాక్టర్‌ వైఎస్సార్‌ ఇంజినీరింగ్‌ కళాశాల బీటెక్‌, బీటెక్‌ (డిప్లమా) 4వ సంవత్సరం 8వ సెమిస్టర్‌ పరీక్ష ఫలితాలను విశ్వవిద్యాలయ వైస్‌ చాన్సలర్‌ ఆచార్య చింతా సుధాకర్‌ విడుదల చేశారు.

సోమవారం విశ్వవిద్యాలయంలోని తన చాంబర్‌ లో రిజిస్ట్రార్‌ ఆచార్య వైపీ వెంకటసుబ్బయ్య, కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషనన్‌ ఆచార్య ఎన్‌. ఈశ్వర్‌ రెడ్డి, ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య నాగరాజు, వైవీయూ ప్రిన్సిపాల్‌ ఆచార్య ఎస్‌. రఘునాథరెడ్డితో కలిసి పరీక్ష ఫలితాల గణాంకాలను పరిశీలించారు.

గత నెలలో జరిగిన ఈ పరీక్షల ఫలితాలు త్వరితగతిన విడుదల చేసిన వైవీయూ పరీక్షల విభాగాన్ని వీసీ అభినందించారు. ఉత్తమ ఫలితాలు లభించిన సందర్భంగా వైవీయూ వైఎస్సార్‌ ఇంజనీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ అధ్యాపకులను, విద్యార్థులను ప్రశంసించారు.

#Tags