Mega Job Mela: మెగా జాబ్‌మేళా... 22 పైగా కంపెనీలు
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా.శ్రీలక్ష్మి, టీఎస్‌కేసీ కో ఆర్డినేటర్ డాక్టర్ సీహెచ్.శోభారాణి మాట్లాడుతూ, అభ్యర్థులు ఇలాంటి జాబ్‌మేళాను వినియోగించుకుని ఉద్యోగాలు సాధించాలని, వీటితో పాటు స్కిల్స్ మెరుగు పరుచుకునే శిక్షణ సైతం అందించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
మేళాలో సుమారు 22 పైగా కంపెనీలు పాల్గొనగా, 358 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వివిధ దశల్లో స్క్రీనింగ్ చేసి 121 మందికి స్పాట్ అపాయింట్‌మెంట్ లెటర్లు అందజేశారు.
చదవండి: CTET Notification: CTET July-2024 వివరాలు... పరీక్ష విధానం, సిలబస్, ప్రిపరేషన్ గైడెన్స్..
శాతవాహన యూనివర్శిటీలో..
శాతవాహన యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్‌మెంట్ కళాశాలలో మార్చి 27న రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహించారు. యాక్సిస్‌బ్యాంక్ 10 మంది, యాక్సెంచర్‌కు ఆరుగురు, పతాంజలి సంస్థలో 15 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారని శాతవాహన యూనివర్శిటీ ప్లేస్‌మెంట్ అధికారి మనోహర్ తెలిపారు.