SCCL: అభ్యర్థులను ఎంపిక చేయాలి

సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి ఆధ్వర్వంలో నేర్పించే స్వయం ఉపాధి కోర్సులకు ఆసక్తి కలిగిన అభ్యర్థులను ఎంపిక చేయాలని డీజీఎం పర్సనల్‌ కోడూరు శ్రీనివాసరావు సూచించారు.
అభ్యర్థులను ఎంపిక చేయాలి

 సంస్థ ప్రధాన కార్యాలయంలో ఆగ‌స్టు 2న‌ నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్తగూడెం కార్పొరేట్‌ ఏరియా పరిధిలోని సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో 2023–24 ఆర్థిక సంవత్సరంలో నిరుద్యోగులకు టైలరింగ్‌, మగ్గం, బ్యుటీషియన్‌, ఫ్యాషన్‌ డిజైనింగ్‌, ప్రీ ప్రైమరీ టీచర్‌ కోచింగ్‌, స్పోకెన్‌ ఇంగ్లిష్‌ కోర్సులకు అభ్యర్థులన ఎంపిక చేయాలని సూచించారు.

అధికారులు, కో ఆర్డినేటర్లు కె. శివకుమార్‌, షరీఫ్‌, మునీల, పుష్ప, లత, రమాదేవి, హిమబిందు, అరుణ, స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.

చదవండి:

SCCL Recruitment 2023: సింగరేణి కాలరీస్‌లో వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌లు

Energy and Environment Foundation: గ్లోబల్‌ సీఎస్‌ఆర్‌ పురస్కారాన్ని అందుకున్న సంస్థ?

సింగరేణి రాత పరీక్ష కేంద్రాల్లో మెటల్ డిటెక్టర్లు

#Tags