School Timings Change: పాఠశాలల పనివేళలు మార్చాలి.. విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు

నిర్మల్‌ రూరల్‌: జిల్లాలో చలి తీవ్రత దృష్ట్యా పాఠశాలల పనివేళలు మార్చాలని ఎస్టీయూ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్‌ ఫైజాన్‌ అహ్మద్‌కు డిసెంబ‌ర్ 20న‌ వినతిపత్రం అందజేశారు.

జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. మూడు రోజులుగా చల్ల గాలులు వీస్తున్నందున విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.

చదవండి: DSP Karunakar: గిరిజనులకు చదువే ఆయుధం

విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారని పేర్కొన్నారు. పాఠశాలల పని వేళలు ఉదయం 10 నుండి సాయంత్రం 4 గంటల వరకు మార్చాలని కోరారు. ఇందులో జిల్లా అసోసియేట్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌, లక్కిడి శ్రీనివాస్‌రెడ్డి, దత్తురాం, శ్రీమంత్‌ తదితరులు పాల్గొన్నారు.
 

#Tags