Women Empowerment: విద్య, ఆర్థిక స్వేచ్ఛతోనే మహిళా సాధికారత
నాగర్ కర్నూల్: చట్టం, పోలీసువ్యవస్థపై మహిళల్లో విశ్వాసం పెరిగిందని, పోలీస్‌శాఖలో కొద్దికాలంగా మహిళల సంఖ్య గణనీయంగా పెరగడమే ఇందుకు నిదర్శనమని ఎస్పీ అన్నారు.
మారుమూల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున మహిళలు పోలీస్ శాఖ నియామకాల్లో చేరుతున్నారని వివరించారు. ఇతర ప్రభుత్వ శాఖల్లోనూ మహిళల సంఖ్య క్రమంగా పెరుగుతోందన్నారు. తన దృష్టిలో మహిళా సాధికారత అంటే మొదట విద్య, ఆర్థిక స్వాతంత్య్రమని పునరుద్ఘాటించారు.
చదవండి: International Womens Day: చరిత్రలో తొలి మహిళలుగా సత్తా చాటింది వీరే..
అవి సాధించినప్పుడే మహిళా సాధికారతకు అడుగులు పడతాయన్నారు. మహిళలు ఆర్థికంగా తమ కాళ్లపై తాము నిలబడినప్పుడు వారికి స్వాతంత్య్రం వచ్చినట్లు అని.. అప్పుడే సమాజంలో మహిళలకు అన్నింటా గౌరవం, ప్రత్యేక గుర్తింపు లభిస్తుందన్నారు.
#Tags