Skip to main content

International Womens Day: చరిత్రలో తొలి మహిళలుగా సత్తా చాటింది వీరే..

ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏడాది మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటాం.
International Womens Day 2024

మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లు, ఇబ్బందులపై చర్చించి,  మహిళా హక్కులు, సమాన్వతం తదితర అంశాలపై అవగాహన కల్పించడమే ఈ మహిళా దినోత్సవ ఉద్దేశం. ఈ సందర్భంగా.. సమాజంలో వివిధ రంగాల్లో తమదైన ముద్ర వేసిన కొంతమంది తొలి మహిళల గురించి తెలుసుకుందాం. వారి ధైర్యం, పట్టుదల మనల్ని స్ఫూర్తి పరుస్తాయి.

కల్పనా చావ్లా: అంతరిక్షంలోకి ప్రవేశించిన తొలి భారతీయ సంతతి మహిళగా కల్పనా చావ్లా దేశానికే గర్వకారణం. 1997లో, ఆమె మిషన్ స్పెషలిస్ట్‌గా రోబోటిక్ ఆర్మ్‌కి ప్రైమరీ ఆపరేటర్‌గా పని చేస్తూ, స్పేస్ షటిల్ కొలంబియాలో ప్రయాణాన్ని ప్రారంభించారు. దురదృష్టవశాత్తూ 2003లో జరిగిన అంతరిక్ష ప్రమాదంలో కన్నుమూయడం అత్యంత విషాదం.

Kalpana Chavla

అరుణిమా సిన్హా: జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారిణి.  విచిత్రకర పరిస్థితుల్లో, చోరీకి ప్రయత్నించిన దొంగలు ఆమెను రైలునుంచి బయటకు నెట్టివేయడంతో ఎడమ కాలు కోల్పోయింది. ఇక్కడే ఆమె జీవితం మలుపు తిరిగింది.  కానీ ఈ విషాదంనుంచి తేరుకుంది.

దృఢ నిశ్చయంతో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన విశేష ఘనతను సాధించింది. తొలి జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారిణిగా,ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి  తొలి భారతీయ వికలాంగురాలిగా రికార్డు క్రియేట్‌ చేసింది. ఈ నేపథ్యంలోనే 2015లో దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీతో  అవార్డు దక్కింది. 

ఆనందీబాయి గోపాలరావు జోషి: డాక్టర్ ఆనందీబాయి జోషి తొలి భారతీయ మహిళా వైద్యురాలు, ఆమె గౌరవార్థం వీనస్ క్రేటర్ "జోషీ" అని పేరు పెట్టారు. తొమ్మిదేళ్ల వయసులో తన కంటే ఇరవై ఏళ్లు పెద్దవాడైన గోపాల్‌రావ్ జోషిని వివాహం చేసుకున్నారు. డాక్టర్‌ చదివాలన్న కోరికకు భర్త సంపూర్ణ మద్దతు లభించడంతో   విజయం సాధించి, రికార్డు క్రియేట్‌ చేశాడు. పద్నాలుగు ఏళ్ళ వయసులో కొడుకుకు జన్మనివ్వడం, ఆ బిడ్డ చనిపోవడం, తన అనారోగ్యం, ఆమెను మెడిసిన్‌లో చేరేలా ప్రేరేపించాయి. పెన్సిల్వేనియాలోని ఉమెన్స్ మెడికల్ కాలేజీలో  చదువుకున్నారు. తరువాత దేశానికి తిరిగొచ్చి ఆల్బర్ట్ ఎడ్వర్డ్ హాస్పిటల్‌లో పనిచేశారు. 

Anandibai Joshi

షీలా దావ్రే: తొలి భారత మహిళా ఆటో-రిక్షా డ్రైవర్ కావాలనే ఆశయంతో పూణే పయమైన ధీరవనిత దావ్రే. చిన్నప్పటినుంచి కార్లు నడపడం అంటే  పిచ్చి.  పురుషుల ఆధిపత్యం కొనసాగే ఈ రంగంలో,  మహిళా డ్రైవర్లు లేని సమయంలో ఆటోనడిపిన సాహసి ఆమె. కష్టపడి పని చేసి సొంత ఆటోను కొనుగోలు చేశారు. ఈమె అద్భుతమైన ప్రయాణం లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదైంది. 

Shila Davre

సరళా థక్రాల్: 1914లో జన్మించిన సరళా తుక్రాల్, 1936లో తన 21వ ఏట ఏవియేషన్ పైలట్ లైసెన్స్‌ని పొంది భారతదేశపు తొలి మహిళా పైలట్‌గా అవతరించారు. భారతదేశంలో చీర కట్టుకుని విమానం నడిపిన తొలి మహిళా పైలట్ థక్రాల్.  కుటుంబంలో మొత్తం తొమ్మిది మంది పైలట్లు,  భర్త ఆమె కరియర్‌కు  తొలి ప్రేరణ. ఆమె ఫైలట్ మాత్రమే కాదు విజయవంతమైన మహిళా పారిశ్రామికవేత్త కూడా, చిత్రకారుడు, కాస్ట్యూమ్ డిజైనర్‌గా ఎన్నో అద్భుతాలు సృష్టించింది.  2008 మార్చి 15న మరణించారు. 

హరితా కౌర్ డియోల్: 1971లో జన్మించిన హరితా కౌర్ డియోల్, భారత వైమానిక దళం (IAF)లో ఒంటరిగా ప్రయాణించిన మొదటి మహిళా పైలట్. 1992లో, రక్షణ మంత్రిత్వ శాఖ  నిబంధనల్లో మార్పులతో  మహిళలను పైలట్‌లుగా చేర్చుకోవడానికి వీలు కల్పించింది. 20వేల మందికి పోటీలో నిలబగా  ఎంపికైన 13 మందిలో  హరిత ఒకరు. ఆమె కర్ణాటకలోని దుండిగల్‌లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో , యెలహంక ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లోని ఎయిర్ లిఫ్ట్ ఫోర్సెస్ ట్రైనింగ్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ALFTE)లో శిక్షణ పొందింది. సెప్టెంబర్ 2, 1994న, 22 సంవత్సరాల వయస్సులో, ఫ్లైట్ లెఫ్టినెంట్ హరితా కౌర్ డియోల్ అవ్రో HS-748లో ఒంటరిగా ప్రయాణించిన మొదటి మహిళా పైలట్‌గా చరిత్ర సృష్టించింది.

శాంతి టిగ్గా: పశ్చిమ బెంగాల్‌లోని  జల్‌పైగురి జిల్లాలో ఆదివాసీ వర్గానికి చెందిన శాంతి టిగ్గా, బాల్య వివాహాల బాధితురాలు.ఇద్దరు పిల్లల వితంతువు తల్లి, భారత సైన్యంలో తొలి మహిళా జవాన్‌గా అవతరించారు ఆర్మీలో చేరి, సైన్య దుస్తులు ధరించాలనేది ఆమె కల. సాయుధ దళాల రిక్రూట్‌మెంట్ శిక్షణా శిబిరంలో ఆమె తన పురుష సహచరులను అధిగమించి, 1.5 కి.మీ పరుగును ఐదు సెకన్ల వేగంతో, 50 మీటర్ల పరుగును 12 సెకన్లలో పూర్తి  చేసి పలువురి మన్ననలు పొందారు.

SHANTITIGGA

తుపాకీ నిర్వహణలో కూడా నైపుణ్యంతో ఆకట్టుకుంది . ఉత్తమ ట్రైనీ టైటిల్‌ను గెలుచుకుంది. ఆమె అసాధారణ విజయాలకు గానీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ కూడా ఆమెను సత్కరించారు. కానీ దురదృష్టవశత్తూ    2013లో గుర్తుతెలియని  వ్యక్తులు ఆమె కిడ్నాప్‌ చేయడం టిగ్గా జీవితం విషాదకరమైన మలుపు తిరిగింది. ఆమె కళ్లకు గంతలు కట్టి, రైల్వే ట్రాక్‌కు కట్టిపడేశారు. ఆమెను గుర్తించి  ఆసుపత్రిలో చేర్చారు. కానీ ఆ తరువాత ఆమె ఉరివేసుకుని  ఆత్మహత్యకు పాల్పడ్డారని చెబుతారు. 

భావనా కాంత్ : భావానా కాంత్ విమానయాన రంగంలో గణనీయమైన పురోగతి సాధించిన గొప్ప భారతీయ మహిళ. డిసెంబర్ 1, 1987న బీహార్‌లోని దర్భంగాలో జన్మించిన ఈమె 2016లో భారత వైమానిక దళం (IAF)లో తొలి మహిళా ఫైటర్ పైలట్‌గా అవతరించింది. ఈమె జర్నీ అంత ఈజీగా ఏమీ సాగలేదు. ఫైటర్ పైలట్‌గా మారేందుకు  అనేక సవాళ్లను, అడ్డంకులను ఎదుర్కొంది.అయినా లక్ష్యంపై దృష్టి. శిక్షణను పూర్తి చేసి తనలాంటి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు. 

అడ్డంకులను, వివక్షల్ని ఎదుర్కొని, పట్టుదలతో విజయం సాధించిన ఇలాంటి మహిళలు కోకొల్లలు. అడ్డంకుల గోడల్న బద్దలుకొట్టి విజయపతాకాల్ని ఎగురవేసిన ఈ ధీర వనితలు మహిళా లోక బంగారు భవితకు బాటలు వేశారనడంలో ఎలాంటి సందేహం లేదు. వారి విజయాలే యావత్‌ ప్రపంచ మహిళలకు స్పూర్తి, ప్రేరణ. దీన్ని అందిపుచ్చుకొని   సాగడమే నేటి తరం మహిళల బాధ్యత. 

International Women's Day: ఫార్చూన్‌ 500 లీడర్లలో మహిళలు అంతంతే..

ఇందిరా గాంధీ: భారతదేశ మొదటి మహిళా ప్రధాన మంత్రి. 1966 నుండి 1977 వరకు, 1980 నుండి 1984 వరకు పదవిలో ఉన్నారు.

సరోజినీ నాయుడు: భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న ప్రముఖ మహిళా నాయకురాలు. 'భారతదేశ కోకిల' గా పిలువబడ్డారు.

మదర్ థెరిసా: పేదలకు, అనాథలకు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సేవ చేసిన కేథలిక్ సన్యాసిని. 1997లో మరణించిన తర్వాత ఆమెకు పోప్ జాన్ పాల్ II పుణ్యస్థానానికి చేర్చారు.

ఎల్. సి. శ్రీకాంత్: భారతదేశ మొదటి మహిళా పైలట్. 1956లో గాలిలోకి ఎగిరి చరిత్ర సృష్టించారు.

విజయలక్ష్మి పండిట్: భారతదేశ మొదటి మహిళా గవర్నర్, మొదటి మహిళా రాయబారి. 1954లో భారతదేశానికి రాయబారిగా నియమితులయ్యారు.

మణిపాల్ రాణి: భారతదేశ మొదటి మహిళా న్యాయమూర్తి. 1959లో బొంబాయి హైకోర్టులో న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

అరుణా ఇరానీ: భారతదేశ మొదటి మహిళా సినిమా దర్శకురాలు. 1972లో 'గుండా' సినిమాతో దర్శకురాలిగా అరంగేట్రం చేశారు.

మీరా కుమార్: భారతదేశ మొదటి మహిళా లోక్‌సభ స్పీకర్. 2009 నుండి 2014 వరకు పదవిలో ఉన్నారు.

పి.వి. సింధు: భారతదేశానికి మొదటి ఒలింపిక్ బ్యాడ్మింటన్ స్వర్ణ పతకాన్ని అందించిన క్రీడాకారిణి. 2016 రియో ఒలింపిక్స్‌లో ఈ ఘనత సాధించారు.

Published date : 08 Mar 2024 12:23PM

Photo Stories