Degree Classes: త్వరలో డిగ్రీ తరగతులు ప్రారంభిస్తాం

మద్దూరు: మద్దూరులో నూతనంగా ఏర్పాటైన డిగ్రీ కళశాల తరగతులను త్వరలో ప్రారంభిస్తామని కళాశాల ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపల్‌ రాజేంద్రప్రసాద్‌ తెలిపారు.

ఆగ‌స్టు 22న‌ మండల కేంద్రంలోని డిగ్రీ కళాశాల ఆవరణలో మండల ప్రజాప్రతినిధులు, పురప్రముఖలతో సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం జూనియర్‌ కళాశాలలోనే డిగ్రీ తరగతులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు అవసరమైన కనీస మౌళిక సదుపాయాలకు ప్రజాప్రతినిధులు, దాతలు సహకరించాలని కోరారు.

బోధన సిబ్బందిని నియమించాలని కమిషనర్‌ను కోరామని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తరగతులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. పీఏసీఎస్‌ చైర్మన్‌ నర్సింహా, మాజీ జెడ్పీటీసీ రఘుపతిరెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు సంజీవ్‌ తదితరులు పాల్గొన్నారు.

చదవండి: TGCHE: దోస్త్‌ ఇంట్రా స్లైడింగ్‌ తేదీలు ఇవే..

ఇంటర్‌ ప్రవేశాల గడువు పెంపు

నారాయణపేట రూరల్‌: ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరంలో చేరేందుకు గడువు తేదీ పొడిగించినట్లు జిల్లా డీఐఈఓ సుదర్శన్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

టెన్త్‌ పూర్తి చేసిన విద్యార్థులు 2024– 25 విద్యా సంవత్సరం ఇంటర్‌ మొదటి సంవత్సరంలో చేరడానికి ఈనెల 31 వరకు గడువు ఉందని తెలిపారు.

నేడు, రేపు దోస్త్‌ఇంట్రా కాలేజీ వెబ్‌ ఆప్షన్లు

నారాయణపేట రూరల్‌: దోస్త్‌ ద్వారా డిగ్రీ కళాశాలలో సీట్లు పొంది అదే కళాశాలలో గ్రూపు మారేందుకు నేటి నుంచి రెండు రోజులు ఇంట్రా కాలేజ్‌ రెండో విడత అవకాశం కల్పించినట్లు చిట్టెం నర్సిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ నారాయణ గౌడ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఆగ‌స్టు 22, 23 తేదీల్లో ఆన్‌లైన్‌ ద్వారా వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవాలని, 24న సీట్లు కేటాయిస్తారని పేర్కొన్నారు.

#Tags