Skip to main content

Group 2 Exams Schedule: గ్రూప్‌–2 పరీక్షలు షెడ్యూల్‌ విడుదల చేసిన టీజీపీఎస్సీ.. షెడ్యూల్‌ ఇలా..

సాక్షి, హైదరాబాద్‌: గ్రూప్‌–2 ఉద్యోగాల భర్తీకి సంబంధించి అర్హత పరీక్షల షెడ్యూ­ల్‌ను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీ­పీ­ఎస్సీ) ప్రకటించింది.
Group 2 Exams Schedule

ఈ ఏడాది డిసెంబర్‌ 15, 16 తేదీల్లో నాలుగు పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు.. మధ్యా­హ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు రోజుకు రెండు సెషన్ల చొప్పున పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపింది.

ఐదోసారి ప్రకటన

వివిధ ప్రభుత్వ శాఖల్లో 783 గ్రూప్‌–2 ఉద్యో­గ ఖాళీల భర్తీకి టీజీపీఎస్సీ 2022 డిసెంబర్‌ 26న నోటిఫికేషన్‌ విడుదల చేయడం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు సంబంధించి అర్హ­త పరీ­క్షలు ఇప్పటికే నాలుగుసార్లు వాయిదా పడగా తాజాగా టీజీపీఎస్సీ ఐదోసారి పరీక్షల తేదీ­లను ప్రకటించింది.

గతేడాది ఆగస్టులో జరగా­ల్సిన ఈ పరీక్షలను ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవ­హా­రంతో అక్టోబర్‌కు రీ–షెడ్యూల్‌ చేస్తూ టీజీపీఎస్సీ తేదీలను ప్రకటించింది. ఆ తర్వాత ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది జనవరిలో నిర్వహించనున్నట్లు కమిషన్‌ మరో ప్రకటన చేసింది. 

చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

అనంతరం కొత్త ప్రభుత్వం ఏర్పడటం, టీజీపీఎస్సీని ప్రక్షాళనతో ఏర్పాటైన కమిషన్‌... గ్రూప్‌–2 పరీక్షలను ఈ ఏడాది ఆగస్టులో నిర్వహించనున్నట్లు షెడ్యూల్‌ విడుదల చేసింది.

కానీ డీఎస్సీ పరీక్షల నేపథ్యంలో గ్రూప్‌–2 పరీక్షల తేదీలను మార్చాలంటూ క్షేత్రస్థాయి నుంచి అభ్యర్థులు తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం చేయడంతో ప్రభుత్వం... పరీక్షల తేదీలను మార్చాలని కమిషన్‌కు సూచించింది. ఈ క్రమంలో డిసెంబర్‌లో ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు ప్రకటించిన కమిషన్‌ తాజాగా షెడ్యూల్‌ను విడుదల చేసింది. గ్రూప్‌–2 ఉద్యోగాల కోసం 5.45 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

గ్రూప్‌–2 పరీక్షల షెడ్యూల్‌ ఇలా.. 

తేదీ

పేపర్‌

సబ్జెక్టు

సమయం

15.12.2024

పేపర్‌–1

జనరల్‌ స్టడీస్‌ అండ్‌ జనరల్‌ ఎబిలిటీ

ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు 

15.12.2024

పేపర్‌–2

హిస్టరీ, పాలిటీ అండ్‌ సొసైటీ

మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు

16.12.2024

పేపర్‌–3

ఎకానమీ అండ్‌ డెవలప్‌మెంట్‌

ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు,

16.12.2024

పేపర్‌–4

తెలంగాణ మూవ్‌మెంట్‌ అండ్‌ స్టేట్‌ ఫార్మేషన్‌

మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు 

Published date : 23 Aug 2024 03:35PM

Photo Stories