Telangana: డిగ్రీ ఫ‌స్ట్ ఇయ‌ర్ నుంచే 10 వేల వేత‌నం.. వ‌చ్చే ఏడాది నుంచి తెలంగాణ‌లో అమ‌లు.. పూర్తి వివ‌రాలు ఇవే

చ‌దువుకొన‌లేని విద్యార్థుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం ఆర్థిక భ‌రోసా క‌ల్పిస్తోంది. చ‌దువుకుంటూనే రెండు చేతులా సంపాదించుకునేలా విద్యార్థుల‌ను ప్రోత్స‌హిస్తోంది. డిగ్రీలో చేరిన మొదటి నెల నుంచే రూ.10 వేల వేతనం అందుకునే అవకాశం క‌ల్పిస్తోంది. ఈ విధానాన్ని వ‌చ్చే విద్యా సంవత్సరం నుంచి 103 కళాశాలల్లో ప్రారంభించాలని తెలంగాణ‌ రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయించింది.
Telangana State Council of Higher Education

ఇందుకు అవసరమైన కసరత్తును కేంద్ర నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ సహకారంతో పూర్తి చేసింది. ఇందులో భాగంగా విద్యార్థులు వారంలో 3 రోజులు కళాశాలలో పాఠాలు వింటే.. మరో 3 రోజులు పని చేయాలి.
37 ప్రభుత్వ, 66 ప్రైవేటు కళాశాలలు
తెలంగాణ రాష్ట్రంలోని 37 ప్రభుత్వ, 66 ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలల్లో కొత్త విధానాన్ని అమలు చేయనున్నారు. అయితే ఈ విధానం అమ‌లు చేయాలంటే విద్యార్థుల సంఖ్య క‌చ్చితంగా 500 మంది మించి ఉండాలి. ప్ర‌భుత్వం సూచించే పది కోర్సుల్లో చేరిన‌ వారికి మాత్రమే రూ.10 వేల వేతనం ఇచ్చే సౌలభ్యం వర్తిస్తుంది. 


ఆ కోర్సులు ఇవే... 
బీబీఏ(రిటైలింగ్‌), బీబీఎస్‌(ఈ-కామర్స్‌), బీబీఏ(లాజిస్టిక్స్‌), బీఎస్‌సీ(ఫిజికల్‌ సైన్స్‌), బీఏ(కంటెంట్‌ అండ్‌ క్రియేటివ్‌ రైటింగ్‌)లో చేరిన వారికి ఇంటర్న్‌షిప్‌ అవకాశం ల‌భిస్తుంది. వీటితోపాటు బీకాం (ఈ-కామర్స్‌), బీకాం (హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌)తోపాటు మరికొన్ని కలిపి మొత్తం 10 కోర్సుల వరకు నూత‌న‌ విధానంలోకి తీసుకోనున్నారు. కొత్త విధానంతో విద్యార్థుల‌కు చ‌దువుకునే స‌మ‌యం నుంచే సంపాదించ‌డం అల‌వాట‌వుతుంది. అలాగే పేద త‌ల్లిదండ్రుల‌కు ఈ నిర్ణ‌యంతో ఉప‌శ‌మ‌నం క‌ల‌గనుంది. 

#Tags