తల్లికి వందనం ఇప్పుడే కాదు: నారా లోకేశ్‌

సాక్షి, అమరావతి: ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికీ ‘తల్లికి వందనం’ పథకం వర్తింపజేస్తామంటూ ఊదరగొట్టిన విద్య, మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రి లోకేశ్‌ ఇప్పుడు నాలుక మడతేశారు.

తల్లులు, పిల్లల్ని మోసం చేస్తున్నారు. పిల్లల డేటా సిద్ధంగా ఉన్నా.. విధివిధానాల రూపకల్పనలో జాప్యం జరుగుతోందని చెబుతూ.. ఇప్పట్లో పథకం అమలు చేయబోమని శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో పరోక్షంగా చెప్పారు.

తల్లికి వందనం అమలుకు విధివిధానాలు రూపొందించడానికి కొంత సమయం కావాలని అడిగామని, దీనిపై మంత్రులందరితో చర్చిస్తు­న్నట్టు చెప్పారు. పథకం పకడ్బందీగా అమలు చేయా­లని తమ ఉద్దేశమంటూ చెప్పుకొచ్చారు. 

అర్హులు ఎంత మంది ఉన్నా ఇవ్వాలనేది ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ పథకం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్ధులకూ వర్తిస్తుందని చెప్పారు. 2019–24 మధ్య ప్రభుత్వ బడుల్లో సుమా­రు 72 వేల మంది విద్యార్ధులు తగ్గారని, దీనిపైనా చర్చిస్తున్నామన్నారు.

చదవండి: Thalliki Vandanam Scheme New Rule : మీ పిల్లల‌కు రూ.15000 రావాలంటే.. ఇవి త‌ప్ప‌నిస‌రిగా ఉండాల్సిందే..!

గత ప్రభుత్వం ‘నాడు– నేడు’ కార్యక్రమం ద్వారా వందల కోట్లు ఖర్చు పెట్టింది వాస్తవమని అన్నారు. గత ప్రభుత్వం సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలు పెట్టి,  ఆ తర్వాత ఐబీ, టోఫెల్‌ తెచ్చిందన్నారు. విద్యా రంగంలో నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఉపాధ్యయులు, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి, అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం వెతకాలని అన్నారు. వచ్చే సంవత్సరం ఏం చేయాలో అందరితో చర్చించి రోడ్‌ మ్యాప్‌ సిద్ధం చేద్దామని చెప్పారు.

టీచర్ల భర్తీ దిశగా తొలి అడుగు వేశామని, వచ్చే సంవత్సరానికి పూర్తి చేస్తామని వెల్లడించారు. 3 నుంచి 10వ తరగతి విద్యార్ధులకు టోఫెల్‌ పరీక్షలపై ఉపాధ్యాయులు, సంఘాల నుంచి అభ్యంతరం వచ్చినందున, ఆ కార్యక్రమాన్ని సమీక్షిస్తామని లోకేశ్‌ మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

ఇతర రాష్ట్రాల్లో ఏం చేస్తున్నారో పరిశీలి­సు­్త­న్నామన్నారు. టోఫెల్‌పై సమీక్షించి, వంద రోజు­ల్లో యాక్షన్‌ప్లాన్‌ తయారు చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వం తీసుకొనిచ్చన ఇంగ్లిష్‌ మీడియంకు వ్యతిరేకం కాదని, టీచర్‌ ట్రైనింగ్‌ లేకుండా ఆ నిర్ణయం తీసుకోవడం కరెక్టు కాదని అన్నారు.  

#Tags