Telugu University: కీర్తి పురస్కారాలు.. ఎంపికైనవారు వీరే..

తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియల్లో విశేషమైన సేవలందించిన 44 మంది ప్రముఖులకు Potti Sriramulu Telugu University 2019వ సంవత్సరానికి కీర్తి పురస్కారాలను ప్రకటించింది.
కీర్తి పురస్కారాలు.. ఎంపికైనవారు వీరే..

విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య తంగెడ కిషన్‌రావు అధ్యక్షతన ఏర్పాటైన నిపుణుల సంఘం ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులను పురస్కార గ్రహీతలుగా ఎంపిక చేసింది. 

చదవండి: ఉత్తమ అధ్యాపక అవార్డులు.. గ్రహీతలు వీరే...

పురస్కారాలకు ఎంపికైనవారు వీరే..

పి.వి.మనోహరరావు(ఆధ్యాత్మిక సాహిత్యం), బాలాంత్రపు వెంకటరమణ(ప్రాచీన సాహిత్యం), గన్ను కృష్ణమూర్తి (సృజనాత్మక సాహిత్యం), రామగిరి శివకుమార్‌(కాల్పనిక సాహిత్యం), వి.రామాంజనీ కుమారి(అనువాద సాహిత్యం), గరిపల్లి అశోక్‌(బాలసాహిత్యం), కవిరాజు (వచన కవిత), బి.రాములు(తెలుగు గేయం), డాక్టర్‌ నలవోలు నరసింహారెడ్డి(పద్యరచన), డాక్టర్‌ వి.రంగాచార్య(పద్య రచన), కూతురు రాంరెడ్డి(కథ), పి.ఎస్‌.నారాయణ(నవల), వై.వి.ఎల్‌.ఎన్‌.శాస్త్రి­(హాస్య రచన), గిడుగు వెంకట రామకృష్ణారావు(జీవితచరిత్ర), మల్లవరపు చిన్నయ్య­(వివిధ ప్రక్రియలు), వడ్డేపల్లి నర్సింగరావు(నాటక రచయిత), దోర్బల బాలశేఖర శర్మ, (జనరంజక విజ్ఞానం), సంకేపల్లి నాగేంద్రశర్మ(పరిశోధన), పొన్నం రవిచంద్ర(పత్రికా రచన), పారుపల్లి కోదండరామయ్య(భాష), ఆచార్య మాడభూషి సంపత్‌కుమార్‌(సాహిత్య విమర్శ), చుక్కాయపల్లి శ్రీదేవి(అవధానం), విజయలక్ష్మి శర్మ(లలిత సంగీతం), దారూరి సులోచనాదేవి(శాస్త్రీయ సంగీతం), అంతడ్పుల రమాదేవి (జానపద గాయకులు), జగ్లర్‌ నారాయణ(జానపద కళలు), డాక్టర్‌ సావిత్రి సాయి(ఉత్తమ రచయిత్రి), ఝాన్సీ కె.వి.కుమారి­(ఉత్తమ రచయిత్రి), బి.హైమావతి(ఉత్తమ నటి), వి.నారాయణ(ఉత్తమ నటుడు), ముట్నూరి కామేశ్వరరావు(నాటక రంగం), డాక్టర్‌ బి.­కుమారస్వామి­(ఆంధ్రనాట్యం), డాక్టర్‌ పసుమర్తి శేషుబాబు(కూచిపూడి నృత్యం), డాక్టర్‌ సి,వీరేందర్‌(వ్యక్తిత్వ వికాసం), నార్నె వెంకట సుబ్బయ్య (హేతవాద ప్రచారం), ప్రొఫెసర్‌ రమా మెల్కోటే (మహిళాభ్యుదయం), ఎ.పుల్లయ్య (గ్రంథాలయ సమాచార విజ్ఞానం), ఎం.సైదానాయక్‌(గ్రంథాలయ కర్త), రఘుశ్రీ (సాంస్కృతిక సంస్థ నిర్వహణ), వేములపాటి మాధవరావు(ఇంద్రజాలం), నర్సిం (కార్టూనిస్ట్‌), డాక్టర్‌ రథం మధనాచార్యులు( జ్యోతిçష్యం), డాక్టర్‌ రాజ్‌ మహ్మద్‌ (ఉత్తమ ఉపాధ్యాయుడు), ప్రొఫెసర్‌ గీతా కృష్ణమాచారి(చిత్రలేఖనం)లకు త్వరలో తెలుగు వర్సిటీలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఒక్కొక్కరిని రూ.5,116 నగదు, పురస్కారపత్రంతో సత్కరిస్తామని రిజిస్ట్రార్‌ ఆచార్య భట్టు రమేశ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 

#Tags