Education News: ఉపాధ్యాయులంతా అందుబాటులో ఉండాల‌న్న డీఈఓ

విద్యార్థుల స్థాయికి అనుగుణంగా ఉపాధ్యాయులు విద్యనందిస్తూ విద్యా కార్యాక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలని బీబీనగర్ డీఈఓ నారాయణరెడ్డి అన్నారు.

డిసెంబ‌ర్ 12న (మంగళవారం) బీబీనగర్‌ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ఉపాధ్యాయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ మాసంలో జిల్లా, రాష్ట్ర స్థాయి పరిశీలకులు అన్ని పాఠశాలలను సందర్శిస్తారని, ఉపాధ్యాయులంతా అందుబాటులో ఉండాలన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు దివాకర్‌యాదవ్‌, ఇందిర, సురేష్‌రెడ్డి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

తొలిమెట్టును సమర్థవంతంగా అమలు చేయాలి
తొలిమెట్టును సమర్థవంతంగా అమలు చేయాలని డీఈఓ నారాయణరెడ్డి అన్నారు. బొమ్మలరామారం మండల కేంద్రంలో నిర్వహించిన స్కూల్‌ కాంప్సెక్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. తరగతిలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచి, వారిని మెరుగైన ఫలితాలు సాధించే దశగా చొరవ చూపాలని తెలిపారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేసి కార్పొరేట్‌కు దీటుగా ఉత్తమ ఫలితాలు సాధిస్తే ప్రజల్లో ప్రభుత్వ విద్యపై మరింత విశ్వాసం పెరుగుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో సీఎంఓ పెసర లింగారెడ్డి, ఎస్‌ఆర్‌జీ ఉపేందర్‌, ఏఎంఓ శ్రీనివాస్‌, నోడల్‌ అధికారి రోజారాణి, వకలక్ష్మి, ఉపాధ్యాయులు మల్లేషం తదితరులు పాల్గొన్నారు.

Free Skill Development Training: సీపెట్‌లో ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ, ఉపాధి కల్పన

 

#Tags